గాలి లేని వాయువేదో ప్రాణమైతే తీసేనే
మాట మాత్రం చెప్పలేవా… నీకు నేను కాననా
ఎదలు రగులును ఉసురు తగులును
కలిసి కనులిక సోలనే
ఎవరు ఎవరిక చివరికెవరిక… ఎదకు కదలిక ఆగనే
కనులు కలలే చెదిరిపోయే
నిజము ఎదురై కుమిలిపోయే
గతము గురుతే చెరిగిపోయే
కలల లోకం లేదనేమో
కలే కన్నే రాయలేను… చెలీ నీ వల్లే కదేనే
ఉదయము నా హృదయము… వెలుగునే చూడగా
ఓఓ… ఊసులేవో విన్న లోకం నన్ను ప్రశ్నించిందిలే
గాలిలోనే వెతికిన… గాయమైతే దొరుకునా
ఇది న్యాయమా, ఓ ప్రాణమా… ప్రయాణమే ప్రమాదమా
కనులు కలలే… నిజము ఎదురై
గతము గురుతే చెరిగిపోయే
కలల లోకం లేదనేమో
Song Credits:
చిత్రం: డేవిడ్ (David)
సంగీతం: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
పురుష గాయకుడు: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
లిరిసిస్ట్: కృష్ణ చైతన్య (Krishna Chaitanya)
దర్శకుడు: బిజోయ్ నంబియార్ (Bejoy Nambiar)
నటుడు: విక్రమ్ (Vikram)
నటి : ఇషా శర్వాణి (Isha Sharvan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.