దాచేకొద్దీ ప్రేమ రేటింపావుతుందే
నీకే సొంతం అవ్వాలంటూ తొందర పడుతుందే
పెదవంచు ఆగెను ఆ మాటే
మనసంతా నీవనే నా ప్రేమే
లిపి లేని భాషలో రాసాలే
తొలి ప్రేమ లేఖ నీకై నే
గుచ్చేస్తూనే నచ్చే గులాబీ కళ్ళే
గుండె చాటునున్న మాటే చెప్పేస్తున్నాయే
పెదవంచు దాచకు ఆ మాటే
మనసంతా నేననే నీ ప్రేమే
నీ నడకలకు నా అడుగులకు వంతెలనే వేసావే
నా తలపులలో నీ కదలికలు ఆ పదనిసలు పడాయే
హో… చిన్ని చిన్ని నవ్వుల్తో నన్ను మొత్తం దోచావే
హో… నీలాకాశం అంచుల్లో నన్ను ఎగరేస్తున్నవే
దాచేకొద్దీ ప్రేమ రేటింపావుతుందే
నీకే సొంతం అవ్వాలంటూ తొందర పడుతుందే
పెదవంచు ఆగెను ఆ మాటే
మనసంతా నీవనే నా ప్రేమే..
కనులకే ఎదురుగా కలలో నీవేగా
మాటలో మాటగా నీ పేరునే పలికిన
నీకై ఎదురు చూస్తున్న..
మురిసిపోతున్న.. బయటపడకుండా..
చిలిపి ఊహలే చాలు అన్నది
అల్లుకోమనే ఆశే ఉంది
మౌనం మాటాడే వేలే వచ్చిందేమో….
నిన్నే చూసే కాలం కానుకయ్యిందే
నీతో ఉండే నిమిషం నాకో జన్మల్లె ఉందే
పెదవంచు ఆపను ఆ మాటే
మనసంతా నీవనే నా ప్రేమే
సాంగ్: దాచేకొద్దీ ప్రేమ (Daachekodhi Prema)
సినిమా: లగ్గం టైమ్ (Laggam Time)
సాహిత్యం : మహేష్ పోలోజు (Mahesh Poloju)
గాయకులు: అదితి భావరాజు (Aditi Bhavaraju), హరి చరణ్ శేషాద్రి (Hari Charan Seshadri)
సంగీతం: పవన్ (Pavan)
నటీనటులు : రాజేష్ మేరు (Rajesh Meru), నవ్య చిట్యాల (Navya Chityala),
రచన, దర్శకత్వం: ప్రజోత్ కె వెన్నం (Prajoth K Vennam)
See Also From This Movie: Prema Prema song lyrics Laggam Time
See Also : O Kadhagaa Modaalai song lyrics Laggam Time
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.