నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
దేవదాసే.. కాళిదాసై..
ఎంత పొగిడినా
కొంత మిగిలిపోయేంత
అందం నీది
నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
ఆదోలాంటి తేనెల బాణం
దిగదా ఎదలోకి
నువ్వు నడిచే దారులలో
పూలగంధాలే ఊపిరిగా
కథ నడిచే మనసు కదే
హాయి రాగాలు ఆమనిగా
దినమొక రకముగ పెరిగిన
సరదా నినువిడి మనగలదా
నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
ఎలా నీకు అందించాలో
ఎదలో కదిలే మధురిమను
నేనే ప్రేమ లేఖగ మారి
ఎదుటే నిలిచాను
చదువుకుని బదులిదని
చెప్పుకో లేవులే మనసా
పదములతో పనిపడని
మౌనమే ప్రేమ పరిభాష
తెలుపగ తెలిపిన వలపొక
వరమని కడలిగ అలలెగశా
నిలవదే మది నిలవదే
సిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలి వలపున తడిసి
దేవదాసే.. కాళిదాసై..
ఎంత పొగిడినా
కొంత మిగిలిపోయేంత
అందం నీది
______________
Song Credits:
పాట పేరు: నిలవదే (Nilavade)
సినిమా పేరు: శతమానం భవతి (Shatamanam Bhavati)
సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramanyam)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogaiah Sastry)
నటుడు: శర్వానంద్ (Sharwanand)
నటి : అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran)
నిర్మాత: దిల్ రాజు (Dil Raju)
దర్శకుడు: వేగేశ్న సతీష్ (Vegesna Satish)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.