చిలిపిగా చూస్తావ్ అలా..
పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా…
చివరికి నువ్వే అలా…
వేస్తావే వల.. నీతో వేగేదెలా…
ఓ ప్రేమా…. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల ..
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది.. ఆపై చేదెక్కుతోందిలా ..
కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా ..
చిలిపిగా చూస్తావ్ అలా..
పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా…
చివరికి నువ్వే అలా…
వేస్తావే వల.. నీతో వేగేదెలా..
నిన్నే ఇలా.. చేరగా ..
మాటే మార్చి మాయే చేయ్యాలా…
నన్నే ఇక.. నన్నుగా.. ప్రేమించని ప్రేమేలా..
ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా
నన్నింతగా ఊరించేస్తూ అల్లెస్తుందే నీ సంకెల…
కొంచం మధురము కొంచం విరహము
వింతలో నువ్వు నరకం ..
కొంచం స్వర్గము కొంచం శాంతము
గొంతులో చాలు గరళం ..
కొంచం పరువము కొంచం ప్రణయము
గుండెనే కోయు గాయం ..
కొంచం మౌనము కొంచం గానము
ఎందుకీ ఇంద్రజాలం ..
ఇన్నాళ్ళుగా.. సాగినా ..
ప్రేమ నుంచి..వేరై పోతున్నా ..
మళ్లీ.. మరో గుండెతో ..
స్నేహం కోరి.. వెళుతున్నా ..
ప్రేమనే.. దాహం తీర్చే సాయం కోసం వేచానిలా
ఒక్కో క్షణం.. ఆ సంతోషం.. నాతొ పాటు సాగేదెలా ఎలా ..
చిలిపిగా చూస్తావ్ అలా..
పెనవేస్తావ్ ఇలా .. నిన్నే ఆపేదెలా…
చివరికి నువ్వే అలా…
వేస్తావే వల .. నీతో వేగేదెలా…
ఓ ప్రేమా .. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల ..
కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది .. ఆపై చేదెక్కుతోందిలా ..
కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా ..
కొంచం మధురము కొంచం విరహము
వింతలో నువ్వు నరకం ..
కొంచం పరువము కొంచం ప్రణయము
గుండెనే కోయు గాయం ..
కొంచం మధురము కొంచం విరహము…
కొంచం పరువము కొంచం ప్రణయము…..
________________
Song Credits:
పాట పేరు: చిలిపిగా (Chilipiga)
సినిమా : ఆరెంజ్ (Orange)
సాహిత్యం: వనమాలి (Vanamali)
నటీనటులు: రామ్ చరణ్ తేజ (Ram Charan Teja), జెనీలియా డిసౌజా (Genelia D’Souza)
సంగీతం: హారిస్ జయరాజ్ (Harris Jayaraj)
దర్శకుడు: బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar)
నిర్మాత : నాగేంద్ర బాబు (Nagendra Babu)
రచయిత : భాస్కర్ (Bhaskar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.