నాతో నువ్వుంటే గలాటా
గొడవే ప్రతి పూట
ప్రేమే పుడుతుంటే గలాటా
తగువే ప్రతి చోట
హే గొడవే కాదా
షాదీ కి మూలం
పడదామా సరిగా
ఓ ఓ.. తగువే చేర్చును
తియ్యని తీరం
వెళదామా త్వరగా ఇలాగ
నాతో నువ్వుంటే గలాటా
గొడవే ప్రతి పూట
ప్రేమే పుడుతుంటే గలాటా
తగువే ప్రతి చోటా
నువ్వు తెలుగు హంసవే
తెలుపలేవి హింసవే
చిలిపి చంద్ర జ్వాలవే
కలికి సూర్య ఛాయవే
దివ్యమైన మహిమలున్న
ప్రేమ దేవ ధూతవే
సోయగాల సైన్యమున్న
ప్రేమ యుక్త భూమివే
తెగువ తెగువ చూపినావే
మగువ జాతి రత్నమా
బిగువు బిగువు చూపమాకే
అగని తగున రూపమా
వదిలి వదిలి వెళ్ళమాకే
కదిలి నన్ను చేరువ
ఎదురు నుదురు ఉండిపోవే
నిధుల నిజస్వరూపమా
రాణి నేను, నువ్వే నా రాజా
జోడి ఎపుడు తాజా తాజా
కుస్తి అయిన కౌగిళ్లే అయినా
వస్తుందంట ఎంతో మజా
చిన్న చిన్న తప్పులు
హద్దు మీరి నడకలు
అందగత్తె ముందర
సహజమే కదా
ముద్దు ముద్దు శిక్షలు
మధురమైన బాధలు
పొందుతుంటే అదే
సౌఖ్యం కాదా
నాతో నువ్వుంటే గలాటా
గొడవే ప్రతి పూట
ప్రేమే పుడుతుంటే గలాటా
తగువే ప్రతి చోట
హే గొడవే కాదా
షాదీ కి మూలం
పడదామా సరిగా
ఓ ఓ తగువే చేర్చును
తియ్యని తీరం
వెళదామా త్వరగా ఇలాగ
గలాట… భలేగా
గలాట… ఇలాగా
Song Credits:
పాట శీర్షిక: గలాటా (Galatta)
ఆల్బమ్ / సినిమా: జవాన్ (Jawan)
మ్యూజిక్ : అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం – చంద్రబోస్ (Chandrabose)
గానం – నకాష్ అజీజ్ (Nakash Aziz), జోనిత గాంధీ (Jonitha Gandhi), అరివు (Arivu)
నటీనటులు: షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పడుకొనే (Deepika Padukone)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.