Home » ఏ కథ ఎటు పరిగెడుతుందో (Ye Kadha) సాంగ్ లిరిక్స్ – కేరింత (Kerintha)

ఏ కథ ఎటు పరిగెడుతుందో (Ye Kadha) సాంగ్ లిరిక్స్ – కేరింత (Kerintha)

by Manasa Kundurthi
0 comments
ye kadha etu Parigeduthundo song lyrics Kerintha

ఏ కథ ఎటు పరిగెడుతుందో
ఏ అడుగేటు తడబడుతుందో
ఏ మలుపేటుగా నెడుతుందో తెలీదే

ఏ క్షణమెప్పుడేం చేస్తుందో
ఎవరినెలా నిలబెడుతుందో
ఎవరినెలా పడగోడుతుందో తెలీదే…

మెరిసే కళలు తడిసాయి ఎందుకో విరిసే లోపుగా
ఎగసే అలలు విరిగాయి దేనికో తలవని తలపుగా
స్వరంలో ఆగిందే కేరింత
కన్నీరే ఓదార్పు ఎంతో కొంత

చందమామ అందలేదని
తగని దిగులు చెందగలమా
వెన్నెలుంది చాలులెమ్మని
వెలుగు పడిన కలగా పయనించలేమా
బంధమెంత బలమైనా
బాధలేని సమయానా
దాని విలువ తెలిసేనా… హ..

చిగురు వగరు వివరాలు సులువుగా తెలియని వయసులో
పగలు రేయి తేడాలు పోల్చని మసకల మలుపులో
స్వరంలో ఆగిందే కేరింత
కన్నీరే ఓదార్పు ఎంతో కొంత

ముందుగానే తెలియదుగా
అసలు సిసలు బ్రతుకు నడక
సమయము కదలదుగా
అప్పుడో ఇప్పుడో కలత కనుపాపనంటకా
అనుభవాలు ప్రతిపాఠం
జరిగినాకే కనుగొంటాం
సరే కానీ అనుకుంటాం.. హా..

ఎటుగా వెళితే ఎం దొరుకుతుందని తెలుపని జీవితం
తనతో పాటు తలవంచి కదిలితే పంచదా అమృతం
స్వరంలో ఆగిందే కేరింత
కన్నీరే ఓదార్పు ఎంతో కొంత

__________________

Song Credits:

పాట పేరు: ఏ కదా (Ye Kadha)
నిర్మాత: దిల్ రాజు (Dil Raju)
దర్శకుడు: సాయికిరణ్ అడివి (Saikiran Adivi)
నటీనటులు: సుమంత్ అశ్విన్ (Sumanth Aswin), శ్రీ దివ్య (Sri Divya)
సంగీతం: మిక్కీ.జె.మేయర్ (Mickey.J.Meyer)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయని: జోనితా గాంధీ (Jonita Gandhi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.