అందమైన కళలకు తీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
సంక్రాంతే ప్రతి దినం
సుఖ శాంతే ప్రతి క్షణం
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
అందమైన కళలకు తీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
కనులు వేరు చూపులు ఒకటే
తలలు వేరు తలపులు ఒకటే
పంచుకున్న ప్రాణం ఒకటే
ఎదలు వేరు స్పందన ఒకటే
పెదవిలోని ప్రార్ధన ఒకటే
ఒకరి కన్నా ఇష్టం ఒకరే
కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లెనూ
కన్నీరై ఎవరున్నా పది చేతులొచ్చి తుడిచేనూ
సమభావం అన్నది సంసారం అయినది
మా ఇల్లు మమతాలయం కవి లేని కవితాలయం
అందమైన కళలకు తీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
కునుకు లేని వాకిలి మాది
అలక లేని అరుగే మాది
మారక లేని మనసే మాదీ
తెరలు లేని తలుపే మాది
గొడవలేని గడపే మాది
కరువు లేని కరుణే మాదీ
ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే
ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే
స్వర్గాలే జాలిగా స్థానాన్నే కోరగా
మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంధాలయం
అందమైన కళలకు తీరం
అమృతాలు కురిసే తీరం
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
_____________________
Song Credits:
చిత్రం: బలాదూర్ (Baladoor)
నటీనటులు: రవితేజ (Ravi Teja), అనుష్క శెట్టి (Anushka Shetty)
దర్శకత్వం: K. R. ఉదయశంకర్ (K. R. Udhayashankar)
నిర్మాత: డి రామానాయుడు (D Ramanaidu)
రచన: K. R. ఉదయశంకర్ (K. R. Udhayashankar)
సంగీతం: K. M. రాధా కృష్ణన్ (K. M. Radha Krishnan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.