నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే
ఓ చెలీ.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆడుకుంది నాతో జాలిలేని దైవం
పొందలేక నిన్నూ ఓడిపోయే జీవితం
జోరువానలోనా ఉప్పునైతి నేనే
హొరుగాలిలోనా ఊకనైతి నేనే
గాలి మేడలే కట్టుకున్నా చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్నా చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా
అంతే.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపోయే ఆశ తీరు పూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకుంది చూడు
రాసి ఉన్న తలరాత తప్పదు చిత్రమే అది చిత్రమే
గుండె కోతలే నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే
కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా
అంతే.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే
ఓ చెలీ.. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే
చిత్రం: విచిత్ర సోదరులు (Vichitra Sodarulu)
పాట పేరు: నిన్ను తలచి (Ninnu Talachi)
తారాగణం: కమల్ హాసన్ (Kamal Haasan), గౌతమి (Gautami) తదితరులు
గాయకులు: S. P. బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam)
సాహిత్యం: రాజశ్రీ (Rajasri)
సంగీత దర్శకుడు: ఇళయరాజా (Ilaiyaraaja)
చిత్ర దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao)
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి