ఓ నది కడలిని ముంచేసిందే
ఓ జడి పుడమిని కమ్మేసిందే
ఓ కల కన్నులను కాజేసిందే
ఓ ముడి మనసుని కట్టేసిందే
అరెరే నిప్పుల వాన మీదనీట్ట పడిపోతున్న
పూలవానే పడుతున్నట్టే పొంగిపోతున్న
బాపురే సూపులలోన మరి మరి అంతటి పదున
కసిగా కోసేస్తున్న కవితలే రాస్తున్నా…
తుఫాను తీరం దాటేసినట్టుందే
పతంగి దారం తెంచేసినట్టుందే
గొడ్డు కారం కన్నా ఘాటుగానే ఉందే
రాగి సంగటి కన్నా కమ్మగానే ఉందే
ఓ నది కడలిని ముంచేసిందే
ఓ జడి పుడమిని కమ్మేసిందే…
ఆనందమనే మాటే పుట్టే నువ్వే పుట్టేసాకే
నువ్వే పుట్టేసాకే నువ్వే పుట్టేసాకే
ఈ కోవెలకో ఓ దేవత వచ్చే నువ్వే కాలెటాకే
నువ్వే కాలెటాకే నువ్వే కాలెటాకే
తలంచుకెళ్లకే తప్పించుకోమాకే అమ్మి
ఏందమ్మి…
నవ్వులు దాచకే నొప్పించుకోమాకే అమ్మి
ఓ లమ్మి ..
కొత్త బట్టలేసి జుట్టు బాగా తీసి
గంటలైనా వేచి ఉంటే
నువ్వు రోజు లాగా చూసి వెళ్ళకుంటే
రోజు మారిపోనందే
టపాసులెన్నో పేల్చేసినట్టుందే
తుపాకీ పెట్టి కాల్చేసినట్టుందే
రంగుల రాట్నం ఎక్కిసినట్టుందే
అత్తరు గాలే పీల్చేసినట్టుందే
హైస్స స్స ఏలే ఎలే ఏలేలే ఏలోయ్
హైస్స స్స ఏలే ఏలో ఏలోయే
హైస్స స్స ఏలే ఎలే ఏలేలే హో
హైస్స స్స ఏలే ఎలే ఏలేలే
నాకెందుకనో నాకంటేనే నువ్వే నచ్చేసావే
నువ్వే నచ్చేసావే నువ్వే నచ్చేసావే
నీ ఊపిరినే నాకే కొంచం పంచి ఇచ్చేసావే
పంచి ఇచ్చేసావే పంచి ఇచ్చేసావే
పట్టేసి కొంగుకు కట్టేసుకున్నవే అమ్మి
ఏందమ్మి…
మెల్లోన మూడే ముల్లేసుకొనివే అమ్మి
ఓ లమ్మి ..
సద్ది మూట తెచ్చి గోరు ముద్ద పెట్టి
చెమట నువ్వు తుడిచిపోతే
కాయ కష్టమైన నేను చేసుకుంటా
దేశమేలే రాజల్లే…
హైస్స స్స (ఏలే ఎలే ఎలే)
హైస్స స్స (ఏలే ఎలే ఎలే)
హైస్స స్స హైస్స స్స హైస్స స్స హైస్స స్స
_____________
Song Credits:
సాంగ్ పేరు: ఓ నది (Oo Nadhi)
సినిమా పేరు: వృషభ (Vrushabha)
గాయకుడు: హరిచరణ్ (Haricharan)
లిరిక్స్ : రామాంజనేయులు (Ramanjaneyulu)
సంగీతం: ఎంఎల్ రాజా (ML Raja)
నటీనటులు: జీవన్ (Jeevan), కృష్ణ (Kriishna), అలేఖ్య ముత్యాల (Alekhya Mutyala)
దర్శకుడు: అశ్విన్ కామరాజ్ కొప్పాల (Aswin Kamaraj Koppala)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.