మోసుకొస్తున్నానే బావ మొత్తం సొగసులు నీకే కాదా
దాసుకొస్తున్నానే బావ దగరికి నన్ను తీసుకోవా
సేసుకపొనస్తున్నావా సెమ్మగిల్లకంటున్నావా
సంచెడు సంచెడు మల్లెపూలు
కుంచెడు కుంచెడు కనకాంబరాలు
నువ్వు నేను పెట్టే ముచ్చట
నిలుసుండి సూత్తానంటున్నాయి
బావా జల్దీ రావా..
పూసుకుందాం పసుపు గంధం
పూలు పెడతా నన్నల్లుకోరా
పోసుకుందం మంగళ తానం
చేసుకుందాం జల్దిన లగ్గం
సుట్ట సెంపల సోకులోడా
నల్ల నల్లటి జుంపాలోడా
అంత పొడుగు మీసమారా
ఒత్తు ఒత్తు గడ్డపోడా
ఎత్తు కెత్తు ఉన్నవోయి
ఎట్లా అందుకుంటానోయి
ముత్యమంతా ఉన్న అనుకోకు
ఎత్తుకు తగ్గ సొత్తు నాది
ఆరు అడుగుల అందగాడా
ఏడు అడుగులేసి పోరా
ఆలు మొగలమైదం..
రామ చిలక ముక్కు నీది
జామ పండు సొగసు నాది
ఎత్తుకోయి మేనబావ
హత్తుకుంటా తనివి తీరా
మామిడోరి పిల్లనోయి మెండేవారి కోడలు నైతా
మెండేవారి పిల్లగాడా మామిడోరి అల్లుడవోయ్
మైదాకెట్టినా చేతులతోని మంగళసూత్రం కట్టేయ్ బావ
పారాణి పెట్టిన కాళ్ళతోని కొచ్చేటి మీసం తిప్పుతనోయి
టేకు సెక్కల మంచలోయి ఏరుకున్న కంచాలోయి
ఇద్దరం ఒక్కటైదాం..
తీరు తీరు ఫోటోలోయి తీసుకున్న ఓడవవోయి
వింటున్నావా యోసపోడా వినిపించిందా అసలు మాట
నీ అత్త మామ ఎదురు కోలా కాడా కాళ్ళు కడుగుతారోయి
మా తమ్ముడైన నీ బామ్మరిది పందిట్లకెత్తుకొత్తడోయి
పూలు పోసి కాళ్ళు కడిగి కన్యాదానం జేత్తరోయి
జీలకర్ర బెల్లం పెట్టె బావ జీవితకాలం తోడు గుండా
నల్ల పూసల దండ చాలు నగలు నట్రాలు నాకేం వద్దు
బావ ఇటు సూడే…
కాలి మీద కాలు పెడతా
కాలి కింది మెట్టెలు పెట్టు
మానెడు సూడు తల్వలు వొయ్యి
మేనమామలు తెచ్చిండ్రోయి
కర్రు జోడు పట్టుకోయి ఇద్దరం ఇత్తునాలు వేద్దాం
ఆడి బిడ్డకు కట్నం పెట్టి ఓడిబియ్యం పోసుకుందాం
గడప కడగుతున్నానోయి కండ్లకు నీళ్లు ఒత్తున్నావోయి
అప్పచెప్పుతున్నారే బావ ఐనంగా నన్ను చూసుకోవా
మొవోళ్లకొక్క మాట ఇయ్యే మారాణిగా చూసుకుంటానను
మల్లి కార్జునుడా అత్తగారిల్లు చేరుతున్న
అందరు నా వొల్లే అనుకుంటా
మూడు ముళ్ళు వేసినవోయి
ముచ్చట ముద్దుగా పెట్టుకుందాం
____________________________
Song Credits:
సాంగ్ : బావా జల్దీ రావా (Bava Jaldhi Rava)
నిర్మాత: మెండెమౌనిక (Mende Mounika), మల్లిఖార్జున్ (Mallikharjun)
సాహిత్యం, గాయకుడు: మామిడి మౌనిక (Mende Mounika)
సంగీతం: కళ్యాణ్ కిస్ (Kalyan keys)
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మామిడి మౌనిక (Mende Mounika)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.