Home » నీలి రంగు చీరలోన (Neeli Rangu Cheeralona) సాంగ్ లిరిక్స్ | గోవిందుడు అందరివాడేలే 

నీలి రంగు చీరలోన (Neeli Rangu Cheeralona) సాంగ్ లిరిక్స్ | గోవిందుడు అందరివాడేలే 

by Manasa Kundurthi
0 comments

తానన నననా తనాన తననన నననా
తానన నననా తనాన తననన నననా
తననాన నననా తాన నననా తాన నననననా

నీలి రంగు చీరలోన
సందమామ నీవె జాణ
ఎట్ట నిన్ను అందుకోనే

నీలి రంగు చీరలోన
సందమామ నీవె జాణ
ఎట్ట నిన్ను అందుకోనే…

ఏడు రంగుల్లున్న నడుము
బొంగరంలా తిప్పేదానా
నిన్ను ఎట్టా అదుముకోనే… హేహేహే

ముద్దులిచ్చి మురిపిస్తావే
కౌగిలించి కవ్విస్తావే
అంతలోనే జారిపోతావే…

మెరుపల్లె మెరిసి జాణ
వరదల్లె ముంచె జాణ
ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడె జాణ
జాణ అంటే జీవితం జీవితమే నెరజాణరా
దానితో సయ్యాడరా ఏటికి ఎదురీతరా…

తానన నననా తనాన తననన నననా
తానన నననా తనాన తననన నననా
తననాన నననా తాన నననా తాన నననననా

రాక రాక నీకై వచ్చి
పొన్నమంటి చిన్నది ఇచ్చే
కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో

పువ్వు లాగ ఎదురే వచ్చి
ముల్లు లాగ ఎదలో గుచ్చి
మాయమయే భామ వంటిదే కష్టమనుకో

ఎదీ కడదాక రాదని తెలుపుతుంది నీ జీవితం
నీతో నువు అతిథివనుకొని వెయ్ రా అడుగెయ్ రా వెయ్
జాణ కాని జాణరా జీవితమే నెరజాణరా
జీవితం ఒక వింత రా ఆడుకుంటె పూబంతి రా

సాహసాల పొలమే దున్నీ
పంట తీసె బలమే ఉంటే
ప్రతి రోజు ఒక సంక్రాంతి అవుతుంది రా

బతుకు పోరు బరిలో నిలిచి
నీకు నీవె ఆయుధమైతే
ప్రతి పూట విజయ దశమియే వస్తుంది రా

నీపై విధి విసిరె నిప్పుతో ఆడుకుంటె దీపావళి
చెయ్ రా ప్రతి ఘడియ పండగే చెయ్ రా చెయ్ రా చెయ్
జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా
జీవితం ఒక జాతర చెయ్యడానికే జన్మరా

________________

సాంగ్: నీలి రంగు చీరలోనా (Neeli Rangu Cheeralona)
సినిమా పేరు: గోవిందుడు అందరివాడేలే (Govindudu Andarivaadele)
సంగీతం: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ (Suddhala Ashok Teja)
గాయకుడు: హరి హరన్ (Hari Haran)
నటీనటులు : రామ్ చరణ్ తేజ (Ram Charan Teja), శ్రీకాంత్ (Srikanth), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), కమలినీ ముఖర్జీ (Kamalini Mukherjee)
నిర్మాత: గణేష్ బాబు (Ganesh Babu)
దర్శకత్వం: కృష్ణ వంశీ (Krishna Vamsi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.