నిన్నే కోరే నే నిన్నే కోరే
ఆపేదెలా నీ చూపునే
లేనే లేనె నే నువ్వై నేనే
దారే మారే నీ వైపునే
మనసులో విరబూసిన ప్రతి ఆశ నీ వలనే
నీ జతే మరి చేరినా
ఇక మరువనే నన్నే హే…
హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్వు నా ప్రాణమా…. ప్రాణమా
హృదయమా వినవే హృదయమా… హృదయమా
ప్రాణమా నువ్వు నా ప్రాణమా…. ప్రాణమా
మౌనాలు రాసే లేఖల్ని చదివా
బాషాల్లే మారా నీ ముందరా
గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ
కలిసే చూడు నేడిలా
నన్నే చేరేలే నన్నే చేరే
ఇన్నాళ్ల దూరం మీరగా
నన్నే చేరేలే నన్నే చేరే
గుండెల్లో భారం తీరగా
క్షణములో నెరవేరిన ఇన్నాళ్ల నా కలలే
ఔననే ఒక మాటతో పెనవేసనే నన్నే హే
హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్వు నా ప్రాణమా…. ప్రాణమా
హృదయమా వినవే హృదయమా… హృదయమా
ప్రాణమా నువ్వు నా ప్రాణమా…. ప్రాణమా
హృదయమా….
హృదయమా
_____________________
సాంగ్ – హృదయమా (Hrudayama)
చిత్రం – మేజర్ (Major) (Telugu)
సంగీతం – శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala)
సాహిత్యం – కృష్ణకాంత్ (Krishna Kanth), వి.ఎన్.వి. రమేష్ కుమార్ (V.N.V. Ramesh Kumar)
గాయకుడు – సిద్ శ్రీరామ్ (Sid Sriram)
నటీనటులు: అడివి శేష్ (Adivi Sesh), సాయి ఎం మంజ్రేకర్ (Saiee M Manjrekar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.