Ranguladhukunna song Lyrics

Ranguladhukunna song Lyrics: Uppena

by Nikitha Kavali

“రంగులద్దుకున్న” పాట ఉప్పెన చిత్రంలోని ఒక అద్భుతమైన మెలోడీ సాంగ్. ప్రేమికుల మధ్య ఉన్న ఆత్మీయ అనుభూతులను నెమ్మదైన మ్యూజిక్, అద్భుతమైన లిరిక్స్ ద్వారా మన హృదయానికి హత్తుకునేలా రాసారు. సముద్ర తీరంలో నాటకీయంగా చిత్రీకరించబడిన ఈ పాట విజువల్‌గా కూడా చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పాట ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంటుంది. ఉప్పెన సినిమా హిట్‌ అవ్వడానికి సంగీతం కూడా ఓ ప్రధాన కారణంగా నిర్ధారించగలుగుతాం.

జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా

రంగులద్దుకున్నా
తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా
కొమ్మలల్లే ఉందాం
ఆకు చాటునున్న…
పచ్చి పిందెలౌదాం
మట్టి లోపలున్నా…
జంట వేరులౌదాం
ఎవ్వరీ కంటిచూపు చేరలేని ఎక్కడా మన జంట ఊసురాని
చోటున పద నువ్వు నేనుందాం

రంగులద్దుకున్నా…….తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా……కొమ్మలల్లే ఉందాం

తేనె పట్టులోన
తీపి గుట్టు ఉందిలే
మన జట్టులోన…
ప్రేమ గుట్టుగుందిలే
వలలు తప్పించుకెళ్ళు,
మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందాం
లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో కొత్త పాఠాలు నేర్చుకుందాం
అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం
ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం
ఏ క్షణం విడివిడిగా లేమందాం

రంగులద్దుకున్నా…….తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా……కొమ్మలల్లే ఉందాం

మన ఊసు మోసే
గాలిని మూట కడదాం
మన జాడ తెలిపే..
నేలను పాతి పెడదాం
చూస్తున్న సూర్యుని తెచ్చి, లాంతర్లో దీపాన్ని చేసి చూరుకేలాడదీద్దాం…
సాక్ష్యంగా సంద్రాలు ఉంటె, దిగుడు బావిలో దాచి మూత పెడదాం..
నేనిలా నీతో ఉండడం కోసం చేయనీ ఈ చిన్నిపాటి మోసం
నేరమేం కాదే ఇది మన కోసం

రాయిలోన శిల్పం దాగి ఉండునంటా
శిల్పి ఎదురైతే బయటపడునంటా
అద్ధమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా
నీలో ఉన్న నేనే బయటపడిపోత
పాలలో ఉన్న నీటిబొట్టులాగా
నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా
నేనిలా నీ లోపల దాక్కుంటా

హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్

పాట: రంగులద్దుకున్న
చిత్రం: ఉప్పెన
గాయకులూ: యజిం నిజార్, హరి ప్రియ
సాహిత్యం: శ్రీమణి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (DSP)
దర్శకుడు: బూచి బాబు సన
నటి నటులు: పంజా వైష్ణవ తేజ్ (Panja Vaishav Tej), కృతి శెట్టి (Krithi Shetty), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), తదితరులు.

Eswara Parameswara Song Lyrics Uppena

Dhak Dhak Dhak Song Lyrics Uppena

Silaka Silaka Song Lyrics Uppena

Sandramlona Neerantha song Lyrics Uppena

Nee Kannu Neeli Samudram Song Lyrics Uppena

Jala Jala Jalapatham Song lyrics Uppena

Ninne Naa Ninne Song Lyrics Uppena

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Stay Informed, Stay Inspired

Subscribe to Our Newsletter for the Latest Trends and Tips!

@2025 u2013 All Right Reserved. Designed and Developed by PenciDesign