నిన్నే కోరింది హృదయం
నన్నే మరిచింది ప్రాణం
నీ స్నేహం కోసం నే వేచానమ్మా..
అసలే ఇది వర్షాకాలం
ఆమ్మో తెగ ఉరిమెను మేఘం
నీవే చలి శ్వాసే నాకందించమ్మా..
మాటే తడ బడుతుందే
ఈ మౌనం చంపేస్తుందే
పాదం నిలవను అందే
ఈ ప్రాయం పరుగెడుతుందే
నీ వల్లే పిల్ల మొదలయిందే ఎదలో గొడవ
వయ్యారాల వెన్నెలవా వస్తావా నన్ను కాదనకా
ఓ నిన్నే కోరింది హృదయం
నన్నే మరిచింది ప్రాణం
నీ స్నేహం కోసం నే వేచానమ్మా..
ఎందుకు నచ్చవో తెలియదు
ఎప్పుడు కలిసావో తెలియదు
నువ్వంటే ఇష్టం అది మాత్రమే తెలిసిందే
నువ్వు కనబడకుంటే కాలం కదలదు
నను కాదంటే ప్రాణం నిలవదు
ఏమయిందో నాకే అర్ధమయ్యి చావదులే
ఎక్కడ బడితే అక్కడ
నువ్వు కనబడుతుంటే టక్కున
ఎవరు నాతో ఉన్న నువ్వునంటుందే పక్కన
నీ ప్రేమల నే పడిపోయాన ఇది అంత నీ మాయేనా
ఓ నిన్నే కోరింది హృదయం
నన్నే మరిచింది ప్రాణం
నీ స్నేహం కోసం నే వేచానమ్మా..
ఎప్పుడు చెబుతావో నీ ప్రేమ
పడుతున్ననే తెగ హైరానా
ఊరించి ఊరించి ఉక్కిరి బిక్కిరి చేయాకే
నేనింకా ఆగలేనమ్మా నీదే ఆలస్యమమ్మా
నువ్వుంటే నాకేం వద్దమ్మా రావే చిలకమ్మా
కష్టంగా ఉందే పిల్ల నువ్వు లేకే నా బ్రతుకంతా
ఇష్టంగా రమంటున్న రావే ఓ వెన్నెలమ్మ
నా గుండెల్లో దాస్తానమ్మా నువ్వంటే పడి చస్తానమ్మా
నిన్నే కోరింది ప్రాణం
నీకై వస్తున్న ప్రియ నేస్తం
నీతోనే పయణం ఇక నా జీవితం..
నాలోనే లేనిన్నాళ్ళు
నీ మీదే నా నయనాలు
ఇన్నాళ్ల దూరాలు చెరిపేయని..
ఎన్నెన్నో ఆశలతో నీ ఎద గూటికి చేరాను
నీ ప్రేమే దొరికితే చాలు నిన్ను చూస్తూ బ్రతికేస్తాను
నీ ఒళ్ళో నేను పసిపాపై ఒదిగుంటాను
నీ వల్లే ప్రియుడా నీ ప్రేమలో పడిపోయాను
నిన్నే కోరింది హృదయం
నీకై వస్తున్న ప్రియ నేస్తం
నీతోనే పయణం ఇక నా జీవితం..
______________________
సాంగ్: నిన్నే కోరింది హృదయం (Ninne Korindi Hrudayam)
నటీనటులు : పూజా నాగేశ్వర్ (Pooja Nageswar), అక్షిత్ మార్వెల్ (Akshith Marvel), ప్రీతి చొక్కుల (Preethi Chokkula)
లిరిక్స్ : అనిత నాగరాజు (Anitha Nagaraju)
గాయకులు: హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav), దివ్య మాలిక (Divya Malika)
సంగీతం: రవి కళ్యాణ్ (Ravi Kalyan)
దర్శకత్వం: సందీప్ నిర్వాన్ (Sandeep Nirvan)
నిర్మాత: నాగి రెడ్డి పేరం (Nagi Reddy Peram)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.