మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
చూడముచ్చటైన అందాల జంట మౌలా
ఆశీర్వదించు మౌలా
రారాజులా ముందు నువ్వు
నీ రాణిలా వెంట నేను
ఇలాంటి ఓ రోజు నేను
ఊహించలేదే ఊహాలోను
ఇన్నేళ్ల నీ కల తీరేనా
సంక్రాంతిగా తెల్లవారేనా
నమ్మేదెలా ఇది నేనేనా
సరి కొత్త కాంతి చేరుకుంది నాలోన
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
చూడముచ్చటైన అందాల జంట మౌలా
ఆశీర్వదించు మౌలా
రివ్వన్నావే నీ నవ్వు గువ్వలు జంటలు జంటలుగా
ఘల్లాన్నావే నీ కాలి మువ్వలు కోవెల గంటలుగా
రెండు జెల్లా లంగరేసి కాలాన్ని ఇచ్చటే ఆపనా
రెండు కళ్ళ వంతెనేసి లోకాన్ని నీలా చూడనా
చెలినిగా జత సాగనా నీ ముద్దు ముద్దు ముచ్చటంత తీర్చలేనా
వెలుగునై నడిపించనా నిన్నల్లుకున్న కంచెలన్నీ తెంచలేనా
ఈ నమ్మకాలు చాలు నా ప్రేమ బాటనా
నా తురుపెక్కడంటే నువ్వెక్కడుంటే అక్కడంటూ చాటి చెప్పనా
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
చూడముచ్చటైన అందాల జంట మౌలా
ఆశీర్వదించు మౌలా
ఆకాశమే అరచేత వాలెను నీ జత చేరగనే
భూగోళమే జళ్ళో పూబంతిగా మారెను నీ వలెనే
వాన విల్లు వర్ణమంతా లేలేత పెదవికి కానుక
నిన్నలోని చీకటంతా మీనాల కన్నులోని కాటుక
ఎవరు నువ్వని అడగనా నేనేంటే నీకు ఎందుకంతా మనసనీ
జత పడే ప్రతి అడుగున వెన్నంటే ప్రేమ నిన్ను నన్ను నడపని
హే ప్రాణబంధమేదో నన్నల్లుకున్నదే
నా గుండె సందడంతా నీ అందమైన పేరులాగా మోగుతున్నదే
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
చూడముచ్చటైన అందాల జంట మౌలా
ఆశీర్వదించు మౌలా
_____________________
పాట పేరు: మౌలా మౌలా (Maula Maula)
సినిమా పేరు: రాచరికం (Racharikam)
గాయకులు: రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), కుమార వాగ్దేవి (Kumara Vagdevi)
లిరిక్స్ : ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి (‘Saraswati Putra’ Ramajogayya Sastry)
సంగీతం : వెంగీ (Vengi)
నటీనటులు : విజయ్ శంకర్ (Vijay Shankar), అప్సర రాణి (Apsara Rani),
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ లంకాలపల్లి (Suresh Lankalapalli)
నిర్మాత: ఈశ్వర్ (Esshwar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.