ఒక్కతే ఒక్కతే ఒక్కతే ఒక్కతే పెండ్లాం ఉండాలే
నా సవితి సవితి మధ్యల కొస్తే నేనేం గావలె
ఒక్కతే ఒక్కతే ఒక్కతే ఒక్కతే పెండ్లాం ఉండాలే
ఓ సవితి సవితి మధ్యల కొస్తే నేనేం గావలె
ఓ గూడులో నన్ను బందీని జెసి
గోడలు దుంకి పోతుండే
పాశాన్నసలు ముట్టనే ముట్టక
పాస్పోయిన బువ్వకు మరిగిండే
ఇజ్జత్ లేని పనులకు పోయి ఇంట్లో నన్నే మరిసిండే
ఒక్కతే ఒక్కతే
హ ఒక్కతే ఒక్కతే ఒక్కతే ఒక్కతే పెండ్లాం ఉండాలే
నా సవితి సవితి మధ్యల కొస్తే నేనేం గావలె
నాకేమో నూకల బువ్వ
దానికేమో సియ్యల కూర
నాకియ్యడు సిల్లీ గవ్వ
దానింటికే పడతాడు తోవ
నాకేమో పాలిస్టర్ చీర
దానికేమో పట్టు చీర
నా కళ్ళల్లో పొంగెను ఏరే
అయినా మరలే వాని తీరే
రాముడు అనుకోని లగ్గమాడితే
రాతిరి అయినా ఇగ రాడే
ఒక్కతే ఒక్కతే
అవ్వ ఒక్కతే ఒక్కతే ఒక్కతే ఒక్కతే పెండ్లాం ఉండాలే
నా సవితి సవితి మధ్యల కొస్తే నేనేం గావల్నే
ఆమ్మో నైట్ అయితే నైన్టీ గుద్ది
బయలెళ్తాడు అత్తరు రుద్ది
ఇక ఎల్లాడు గంటల కొద్దీ
నాకేమో ఇంతింబంది
ఏడడుగులు ఏసినా మొగడే
దన్నాడగంది ఇంటికి రాడే
పెళ్ళాం ఏవతో గొళ్ళెం ఏవతో నాకే సమజైతలేదే
ఊరంతా తిరిగిన దాన్ని ఉంచుకున్నాడే నా మొగడే
ఒక్కతే ఒక్కతే ఒక్కతే ఒక్కతే పెండ్లాం ఉండాలే
నా సవితి సవితి మధ్యల కొస్తే నేనేం గావల్నే ఒసేయ్
అయ్యో తలుపు సూపేది ఇడ
మరి తలుపులు మూసేసి ఆడ
పరుగు దూసేది ఇడేహే
పరుగులు పెట్టేది ఆడ
పేరుకు మాత్రం ఒక్కటే ల్యాండ్
వాడకమైతే ఊరంతా
ఉంచుకున్నదే రంభ ఊర్వశి
పడి సస్తాడది లేకుంటే
పెద్దల సాక్షిగా అయినా పెళ్లి
మరి ప్రేమ సూపడు గోరంతా
ఓయమ్మో ఒక్కతే ఒక్కతే ఒక్కతే ఒక్కతే పెండ్లాం ఉండాలే
నా సవితి సవితి మధ్యల కొస్తే నేనేం గావలే
అమ్మమ్మ ఎవలికి చెప్పుకొను
ఆ రండను మరిసిపోడు
ఆ హౌలది పాడుగాను
మా ఆయనకు ఎసెను ప్లాను
రాతల రాసిన నా మొగుడే
దాని గీత ధాటి రానన్న రాడే
ఏ మందు పెట్టి మలిపిందోగాని
పొద్దు మాపు ఆడ్నే పండే
నా బొమ్మ ఫట్టు
దాని బొమ్మ హిట్టు
నేను ఏమి చేసేటట్టు
ఎహే ఎహే
ఒక్కతే ఒక్కతే ఒక్కతే ఒక్కతే పెండ్లాం ఉండాలే
నా సవితి సవితి మధ్యల కొస్తే నేనేం గావలే
నేనెవలకు చెప్పాలే నా సంసారం పాయే
_______________________
నటి: ప్రియ (PRIYA)
గాయని: ప్రభ (PRABHA)
సంగీతం: వెంకట్ అజ్మీరా (VENKAT AJMEERA)
లిరిక్స్, కథ, కాన్సెప్ట్: చెలుకల శ్రీనివాస్ యాదవ్ (CHELUKALA SRNIVAS YADAV)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.