Home » చిలకమ్మా (Silakamma) Love Failure సాంగ్ లిరిక్స్ Part-2 

చిలకమ్మా (Silakamma) Love Failure సాంగ్ లిరిక్స్ Part-2 

by Lakshmi Guradasi
0 comments
Silakamma Part 2 song lyrics Love Failure song

ఇంటి తోవను విడిచి పెట్టి
కంటి కునుకును గాల వెట్టి
అడవి తల్లి సాయం కోరిండే
చిలకమ్మా చెంతకు చేరగా
చేతలు ఎత్తి మొక్కిండే

చిన్నదాని చిన్నినవ్వు చూడక ఎన్ని గడియలయే
గండాలన్నీ గుంపై గుడినయే
చిలకమ్మా కోసం చిన్నవాడు చిన్నబోయిండే
కారు మబ్బు చీకటి చీల్చే ఎర్ర ఎర్రని సూర్యుడుగా తీరే
నీలి మబ్బు నీడ వోలె నీకు తోడుగా నిల్చెటోడే
ఎక్కి ఎక్కి ఏడవబోకే నిన్ను ఏలా గని వాడొచ్చే
ఓ.. చిలకమ్మా దిగులు పడకే పాణమా
ఓ.. చిలకమ్మా చింత ఎందుకే మౌనమా

చిమ్మ చీకటిలో చిక్కుకున్నదే నా ప్రేమ..
చిన్ని గుండెకు గాయం అయిందే చిలకమ్మా
కంటి కన్నీళ్ల బాధల్లో దాచనే నీ ప్రేమ..
చింత ఎందుకే నీ కొరకు వస్తున్న చిలకమ్మా

నిన్ను చూడంది ఎట్లుంటనే
నువ్వు లేకుండా నేనుండనే
కానరావమ్మ కను చూపుకే
కలవరిస్తున్న కనిపించవే
ఈ దయలేని లోకాన నువ్వు నేను ఎడబాసినామెందుకే
ఓ.. ఓ.. నా చిన్ని చిలకమ్మా
ఓ.. ఓ.. నీ జాడ సూపమ్మా
ఓ.. ఓ.. నా చిన్ని చిలకమ్మా
ఓ.. ఓ.. నీ జాడ సూపమ్మా

కారిమబ్బు చీకటిలోన కాకి దురని అడవి లోన
కష్టమైన దాటొస్తానమ్మా నిన్ను చేరగా
ఊపిరాగినట్టుంది లోన ఉండిపోతి నీ ఊహాలోన
ఉట్టి మాట కాదే చిలకమ్మా ఒట్టేసి చెప్పనా

అల్లాడిపోతున్న ఒంటరినై అల్లంత దూరాన నీ కొరకై
తనువెల్ల తలిచిన నీ ప్రేమకై నిలువెల్ల నిలిచిన నీ వాడినై
ఓర్వలేదమ్మా కలి కాలమే కాటు వేసింది మన ప్రేమనే
దైవముందన్నా నమ్మకమే ధైర్యమిచ్చింది నడిపించనే
అలిసిపోతున్న ఆరాటపడుతున్న అందని అందాల జాబిల్లివే
ఓ.. ఓ.. ఓ.. నా చిన్ని చిలకమ్మా
ఓ.. ఓ.. నీ జాడ సూపమ్మా
ఓ.. ఓ.. నా చిన్ని చిలకమ్మా
ఓ.. ఓ.. నీ జాడ సూపమ్మా

మూడు ముళ్ళ బంధానివమ్మా మురిసిపోతినే ముద్దుగుమ్మ
మరువలేక పోతున్నదమ్మా నా మనసు వేదన
కలిసి ఉంటామనుకున్నానమ్మా విడిచి ఉండలేని చిలకమ్మా
కలలో కూడా అనుకోలేదమ్మా ఈ నరక యాతన
చిలకమ్మా నీకై వనవాసమే చేస్తున్నానే నేను సావాసమే
ఏవైనా ఏదైనా సాధిస్తానే నీకొరకే చేస్తా సాహసమే

ఆ సీతమ్మ రామయ్యనే కలిపేను భక్తుడు హనుమంతుడే
నా చిలకమ్మా నీ చెంతకే తప్పక చేరుస్తాడు ఆ దేవుడే
చావుబతుకైనా నిను చేరుకుంటానే అంటుంది కడసారి నా ప్రాణమే
ఓ.. ఓ.. ఓ.. నా చిన్ని చిలకమ్మా
ఓ.. ఓ.. నీ జాడ సూపమ్మా
ఓ.. ఓ.. నా చిన్ని చిలకమ్మా
ఓ.. ఓ.. నా ప్రాణ చిలకమ్మా

______________

లిరిక్స్ : కపిల్ మద్దూరి (Kapil Madduri)
గానం: రామ్ అద్నాన్ (Ram Adnan) & కనుకవ్వ (Kanukavva)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
నటీనటులు : అరవింద్ (Arvind) & రీను Sk (Reenu Sk)
డై: తిరు కుండెల్లా (Thiru Kundella)
నిర్మాతలు: వినీషా (Vinisha) & ఇషిక (Ishika)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.