గుండెల్లో దాగినా బాధే గురుతొస్తుంటే భారంగుందే
కళ్ళల్లో కన్నీరాగనంటుందే,
గతమంతా మాయగా ఉందే గడిచిన కథనే వేరుగా ఉందే,
మనసంతా మూగబోయి చూస్తుందే
మనమంటు వేరుగా ఉన్నామా
మనకోసమే మనము అనుకున్న
ఈ క్షణము నీతోనే లేకున్నా
ప్రతి క్షణము నీలో ఉన్న…
ప్రేమా.. గుండెలోతు గాయమై నువ్వున్నా…
ప్రేమా… చిన్న మందు రాసి నాతోనే ఉండిపోవా …
కలిసుంటా అన్నావూ కలగానే మిగిలావు
కలవరమై హృదయంలో కాల్చేసి పోయావు
మౌనంగా ఉన్నావు మాటలు లేవన్నావు
మనసుతో మాటాడేలోగా మరుపు లా నువ్ మిగిలావు
వెతికానే నాలో నిన్ను వీడిపోని వెన్నెల నువ్వు
వివరంగా వివరించాల వినబడలేదా
మోసానే ఊహలో నిన్ను కాసనే నిన్నే నమ్ము
రాసనే ఇద్దరి కథని కనపడలేదా ..
ప్రేమా.. గుండెలోతు గాయమై నువ్వున్న .
ప్రేమా… చిన్న మందు రాసి నాతోనే ఉండిపోవా.. ఓ…
నీడల్లో ఉన్నావు నిన్నైపోయావు
రేపటికి నాతోటి నువ్వెక్కడ మిగిలావు
సంద్రంలా మారవు అలల నను చేరావు
చివరికి నా తీరం వదిలి తిరిగెళ్లి పోయావు
ముసిరే ఆ మేఘం మాటున కసిరే కన్నీళ్లే వాన
విసిరే ఆ మెరుపులలోన నా చిరునామా
అరెరే ఎటువైపు ప్రేమ నడి నావలో ఒంటరికానా
వదిలేస్తే బతికుంటానా ఓ క్షణమైనా …
ప్రేమా.. గుండెలోతు గాయమై నువ్వున్న .
ప్రేమా… చిన్న మందు రాసి నాతోనే ఉండిపోవా.… ఆ….
_______________________
సాంగ్ : గుండెల్లో దాగిన బాధే (Gundello Daagina Badhe)
పేరు – వాస్తవం (Vasthavvam)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
సంగీతం మరియు సాహిత్యం – PR
రచయిత & దర్శకుడు – జీవన్ బండి (Jeevan Bandii)
నిర్మాత – ఆదిత్య ముద్గల్ (Aditya Mudgal)
నటీనటులు – మేఘశ్యామ్ (Meghashyam), రేఖ నిరోషా (Rekha Nirosha)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.