తన గాయాల గుండెల పైన
చీల్చి వెళ్లాకే ఓ చిన్ని మైన
దయలేదా పేదోడి పైన
అనుమానించకే చిన్నదాన
అలుపెరుగక ఉన్నడే ఆలోచించవే
ప్రేమను పంచవే తనకు అన్నీ నీవే
వాడి గుండే సప్పుడు వినే
చిన్ని చిన్నంటూ కొట్టుకునే నువ్ వస్తావనే
చిన్ని ఆశలు పెడితివే నన్నే అనుమానిస్తివే
అనుమానిస్తివే చిన్ని ఆగం చేస్తివే
నన్ను మోసం చేస్తివే
నా గుప్పెడు గుండెలో
నీ సేంత ప్రేమను నింపవే
ఈ పేదోడి బాధలన్నీ
నీ కంట చూడరావే
మూడు ముళ్ళే నీ మేడలో వేసి
నిన్ను మనువాడుతాననుకున్నా
ఏడు అడుగులు నాతో కలిసేసి
ఈ జన్మకు తోడైతావనుకున్నా
పెళ్లి పట్టు చీర కొంగు ముడిపడి
నా తోడుంటావనుకున్నా చిన్ని
ఈ కాలమే నాకెదురొచ్చినా
చేసుకుంటాను అనుకున్ననే పెళ్లి
వేరే వాడితో తిరిగిన నే ప్రేమానుకోలేదే
మానసిచ్చి మనువాడుతావని వాడితోనే కలగలనే
పున్నమోలే వచ్చినవే అమాసమోలే పోతున్నావా
ఓ ఎన్నెలమ్మ చెప్పవే నా ఎదనంతా దాచేలా
కనీళ్ళు కనుకలివ్వాలా..
అంతటి కృష్ణకే రాధా ప్రేమ పెళ్లి దక్కలే
ఇంతటి మనుషులం మనమెంతరా
చిన్నిని మరచి పోనీ రాత లేదనుకో
నిన్ను ప్రేమించలేదని నువ్వు తెలుసుకో
చిన్ని ఆశలు పెడితివే నన్నే అనుమానిస్తివే
అనుమానిస్తివే చిన్ని ఆగం చేస్తివే
నన్ను మోసం చేస్తివే
నా గుప్పెడు గుండెలో
నీ సేంత ప్రేమను నింపవే
ఈ పేదోడి బాధలన్నీ
నీ కంట చూడరావే
పసుపు బట్టల మీద ఒట్టేసి
నువ్వు చెప్పవే ఓ నా చిన్ని
నన్ను ప్రేమించలేదా అని
నువైనా అడగవే అవని
ఈ తాళిబొట్టుతో ఉరేసి
నన్ను తగలబెట్టయినా పోవే
నా తలపోసినా తలంబ్రాలే
తనువెల్ల చేసిన గాయాలే
నా శ్వాసనే వీడినా ప్రేమ తగ్గనే తగ్గలే
నా కలల కాంతిని చెరిపి పోతావని ఊహించలే
గుండే బరువైతున్నదే నీ రాకకై వేచుంటనే
ఓ మనసా మరువకే తన ప్రేమలేక
నన్ను విడిచిన పందిట్లో బందినౌతా
చిన్ని లేదంటూ తన పుస్తలడుగుతున్నదే
మళ్లిపోవంటే మేడలో కలిసేవితే మనసు చంపుకున్నదే
పెళ్లి పందిరినే కనికళ్ళెంలా చేసెళ్లిపోతున్నవా చిన్ని
మరో జన్మంటూ ఉంటె తన ప్రేమ నిజమై పుడతాడే మళ్ళి
చిన్ని ఆశలు పెడితివే నన్నే అనుమానిస్తివే
అనుమానిస్తివే చిన్ని ఆగం చేస్తివే
నన్ను మోసం చేస్తివే
నా గుప్పెడు గుండెలో
నీ సేంత ప్రేమను నింపవే
ఈ పేదోడి బాధలన్నీ
నీ కంట చూడరావే
____________________
సాంగ్ : చిన్ని ది వార్ ఆఫ్ లవ్ (Chinni The War of love)
-లిరిక్స్ డైరెక్షన్ ప్రొడ్యూసర్: పవనకల్యాణ్ నాగిర్త (Pavankalyan Nagirtha)
-సంగీతం: ఇంద్రజిత్ (Indrajitt)
-గానం: హన్మంత్ యాదవ్ (Hanmanth yadav) & వాగ్దేవి టీమ్ (Vagdevi Team)
-నటీనటులు : రాజు లింగాల (Raju Lingala) & అనూష (Anusha), కిరణ్ బండారి (Kiran Bandari)
-బాలనటులు: మిల్కీ, నిశాంత్, మోక్షిత్, యశస్విని
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.