ఇచ్చోటనే మా ఖర్మ కాళీ ఈ మహానుభావుడు తిరుగుచుండే…
ఇచ్చోటనే ఈ కుర్రమూకల కథలు నడుపుచుండే…
ఇచ్చోటనే…. ఆ దండ నాయకుని రూపము దర్శనమిచ్చే…
ఆఆ…. ఆఆ
శివరాకరికి మన గేదెల రాజు యవ్వరం కాటి సీనుకొచ్చిందే మా యమ్మా…
అన్యాయంగా సంపేసరే మా యమ్మా…
నీ నేతి కొట్టా…
నీకు పాడే కట్టా…
నీకు పిండమెట్టా…
నిను మెట్టనెట్టా…
నీకు నిప్పు పెట్టా…
నీకు మట్టి కొట్టా…
రాజో.. మా రాజా…
రాజో.. మా రాజా..
రాజో.. మా రాజా..
రాజో.. మా రాజా..
నిను తిట్టినోడి నాలుకూడిపోను…
నిను కొట్టినోడి కాళ్లిరిగిపోను…
నిను కొట్టినోడి కాళ్లిరిగిపోను…
నిను ముత్తినొడి సేతులిరిగిపోను…
నిను తాకినోడి తల పగిలిపోను…
నిను తాకినోడి తల పగిలిపోను..
ఎటెల్లిపోనావూ రాజూ…
ఒక్కసారి కంటపడవ రాజూ…
నా సేతి కాపి తాగిపోవా రాజూ…
ఓక తీపిమాట సెప్పిపోవా రాజూ…
రాజో.. మా రాజా…
రాజో.. మా రాజా…
రాజో.. మా రాజా…
రాజో.. మా రాజా…
ముదనష్టపోడా ..
సచ్చినోడా ..
నీ నోరుబడ..
నీ జిమ్మడ ..
నీ బతుకు చడ..
నీ బండబడ..
నా మెడకి గొలుసు కొన్నావు రాజో…
అది మెడకెప్పుడు సేరుతాది రాజో???
అది మెడకెప్పుడు సేరుతాది రాజో???
నా సేతి గాజులన్నావు రాజో…
నా సేతికేప్పుడు సేరుతాయి రాజో???
నా సేతికేప్పుడు సేరుతాయి రాజో???
జడకుచ్చులు కొన్నవ రాజో…
వాటి జాడైనా లేదుయే రాజో…
రాజభోగమన్నవ రాజో…
నీ రాకే కరువైపోయే రాజో…
రాజో.. మా రాజా…
రాజో.. మా రాజా…
రాజో.. మా రాజా…
రాజో.. మా రాజా…
రాజో.. మా రాజా…
రాజో.. మా రాజా…
_______________________
చిత్రం – గేదెల రాజు కాకినాడ తాలూకా (Gedela Raju kakinada Taluka)
రచన మరియు దర్శకత్వం – చైతన్య మోటూరి (Chaitanya Moturi)
సంగీతం – రఘు కుంచె (Raghu Kunche)
లిరిక్స్ – లలితా కాంతారావు (Lalitha Kantharao)
గాయని – కె మంగా దేవి (K Manga Devi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.