పుట్టినింటి నుండి మెట్టింటి కోడలై
బయలుదేరెను నేడు భూదేవి వధువుగా
కోదండ రామయ్య కౌగిల్లో చేరగా
తనువంతా మురిసేను సీతమ్మ తల్లిగా
చిరునవ్వుతోనీ నట్టింట సీతమ్మ
చిందులేస్తూ తిరిగే మా కంటి పాపల
బంధాలు ప్రేమలను కూడగట్టుకొని
మా ఇంట మహా లక్ష్మి బయలుదేరెను నేడు
నీ గుడి ముందాల సీతమ్మ
పందిరి గుంజాలే సీతమ్మ
పందిరి గుంజాలే సీతమ్మ
చుక్కల ముగ్గులే సీతమ్మ
నీ గుడి ముందాల సీతమ్మ
పందిరి గుంజాలే సీతమ్మ
పందిరి గుంజాలే సీతమ్మ
చుక్కల ముగ్గులే సీతమ్మ
అందాల లోగిలి పచ్చని పందిరి
సన్నాయి సందడి కోరుకున్న పెనిమిటి
ఈ తాటి చాపలు మామిడి పీటలు
దీపాల కాంతులొ కొత్త పెళ్లి కూతురు
నీ గుడి ముందాల సీతమ్మ
పందిరి గుంజాలే సీతమ్మ
పందిరి గుంజాలే సీతమ్మ
చుక్కల ముగ్గులే సీతమ్మ
ఏలే ఏలే ఏలే ఏలే ఏలేలో
ఏలే ఏలే ఏలే ఏలే ఏలేలో
ఏలే ఏలే ఏలే ఏలే ఏలేలో
ఏలే ఏలే ఏలే ఏలే ఏలేలో
రంగుల చినుకులే సీతమ్మ
మంగళ తానలే సీతమ్మ
మంగళ తానలే సీతమ్మ
యవ్వన తీర్ధాలు సీతమ్మ
రంగుల చినుకులే సీతమ్మ
మంగళ తానలే సీతమ్మ
మంగళ తానలే సీతమ్మ
యవ్వన తీర్ధాలు సీతమ్మ
వరుసైన జంటలు రంగోలి ఆటలు
తడిసిన బట్టలు ఫోటువాల పోసులు
సయ్యాట పాటలు బావాల సైగలు
గారాల మాటలు కొత్త పలకరింపులు
నీ గుడి ముందాల సీతమ్మ
పందిరి గుంజాలే సీతమ్మ
పందిరి గుంజాలే సీతమ్మ
చుక్కల ముగ్గులే సీతమ్మ
నడుముకు వడ్డానమే సీతమ్మ
తురుపు సింధూరమే సీతమ్మ
తురుపు సింధూరమే సీతమ్మ
సిగ్గుల సింగారమే సీతమ్మ
నడుముకు వడ్డానమే సీతమ్మ
తురుపు సింధూరమే సీతమ్మ
తురుపు సింధూరమే సీతమ్మ
సిగ్గుల సింగారమే సీతమ్మ
అందాల మగువలు రంగుల చీరలు
అద్దాల రవికలు సీగల నిండ మల్లెలు
సొమ్ముల సోకులు కంగారు గాజులు
మైదాకు చేతులు ఎదురు కోల ముంతలు
నీ గుడి ముందాల సీతమ్మ
పందిరి గుంజాలే సీతమ్మ
పందిరి గుంజాలే సీతమ్మ
చుక్కల ముగ్గులే సీతమ్మ
ఏలే ఏలే ఏలే ఏలే ఏలేలో
ఏలే ఏలే ఏలే ఏలే ఏలేలో
ఏలే ఏలే ఏలే ఏలే ఏలేలో
ఏలే ఏలే ఏలే ఏలే ఏలేలో
పువ్వుల పల్లకిలో సీతమ్మ
నీ ఎదురు చూపులే సీతమ్మ
నీ ఎదురు చూపులే సీతమ్మ
మంగళ హారతులే సీతమ్మ
పువ్వుల పల్లకిలో సీతమ్మ
నీ ఎదురు చూపులే సీతమ్మ
నీ ఎదురు చూపులే సీతమ్మ
మంగళ హారతులే సీతమ్మ
తొలి సూరి సూర్యుడు శ్రీరామ చంద్రుడు
సుగుణాల సీతను లగ్గమాడ దేవుడు
కస్తూరి తిలకము జిలకర బెల్లము
మంగళ సూత్రము తలంబ్రాల వర్షము
నీ గుడి ముందాల సీతమ్మ
పందిరి గుంజాలే సీతమ్మ
పందిరి గుంజాలే సీతమ్మ
చుక్కల ముగ్గులే సీతమ్మ
________________________
లిరిక్స్ : కాటం భరత్ (Katam Bharath) (రాము యాదవ్ (Ramu Yadav, చితరంజన్ (Chitaranjan))
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Azmeera)
గాయకుడు : బొడ్డు దిలీప్ (Boddu Dileep), ప్రభ (Prabha)
కిడ్స్ వోకల్స్: స్రగ్వి (Sragvi), స్నికిత (Snikitha)
నటీనటులు : లాస్య స్మైలీ (Lasya Smiley) హన్మంత్ బిట్టు (Hanumanth bittu dancer)
నిర్మాత : బూర చితరంజన్ (Boora Chitharanjan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.