తాళి కట్టినానమ్మ నీకు
యాదిరాలేనా నేను యాదిరాలేనా
నీడనై ఉంటిని కదనే
యాదిరాలేనా నేను యాదిరాలేనా
తాళి కట్టినానమ్మ నీకు
యాదిరాలేనా నేను యాదిరాలేనా
నీడనై ఉంటిని కదనే
యాదిరాలేనా నేను యాదిరాలేనా
పచ్చగా పండిన సంసారంల
నిప్పుల పోసినదెవరు
ఓ దేవుడా నువ్వన్నా చెప్పు
ఎక్కడ పొదును నేను
కట్టుకున్నదే కాలదన్నే ఏమి పాపము చేస్తిని నేను
అడిగినదల్లా కాదనుకుండా తెచ్చిపెట్టినాను కాదు
మన సంసారంలా అగ్గె పోసినవే పెండ్లామా
తల ఎత్తుకోలేని తీరుకు చేసినవే
ఓ నీతి లేని దానివి అయినవే పెండ్లామా
నీ ఎత్తు తప్పిన పోకడవయ్యినవే
తాళి కట్టిన మగడే నీకు యాదికి రాలేడా
కన్య దానం చేసిన మీ వొళ్ళు గుర్తుకు రాలేదా
కాలి మెట్టెలు పెట్టిండు కాదనే యాదికి రాలేదా
అగ్ని సాక్షిగా చేసిన ఒట్టే గుర్తుకు రాలేదా
నీకు గుర్తుకు రాలేదా
ఓ పల్లెత్తి అనలే
ఒక చెంప దెబ్బ నిన్ను కొట్టలే
కట్టుకున్న కాడి నుంచి పెండ్లామా
గుండెలో దాచినా కాదనే
ఊరు మంది ముంగట నీకు పూస్తే కట్టినా
ఆ పంచభూతాల పై ఒట్టు వేసి చెప్పినా
మాట యాదికి రాలేదా పిల్ల
పాపకారి పని చేసినవా
నవ్వుల పాలు నన్నే చేసిందే పెండ్లామా
అవ్వ తోడు ఎంత ఘోరం చేసినవే
ఈ పడు ఆలోచనలేట్లా వచ్చినయే పెండ్లామా
పక్క పంచుకునే కాడికే పోయినవే
నన్ను సద్దుగట్టి సాగదోలి
నువ్వు సరసానికే కాలు దువ్వి
ఎర్రటెండా శ్రమ నాకు
పిల్ల సోపతోని తోడు నీకు
అనుమానమే వచ్చినా నమ్మకమే ఉంచిన
నా గుండెకు కోత గొత్తివా పిల్ల పరుపుల్ల కనపడితివా
బతికున్న పీనుగు నన్నే చేసి తాగుబోతును చేస్తివా
మనసంసారంలా అగ్గె పోసినవే పెండ్లామా
తల ఎత్తుకోలేని తీరుకు చేసినవే
(తల ఎత్తుకోలేని తీరుకు చేసినవే)
నీతి లేని దానివి అయినవే పెండ్లామా
నీ ఎత్తు తప్పిన పోకడవయ్యినవే
(నీ ఎత్తు తప్పిన పోకడవయ్యినవే)
మనసంసారంలా అగ్గె పోసినవే పెండ్లామా
తల ఎత్తుకోలేని తీరుకు చేసినవే
(తల ఎత్తుకోలేని తీరుకు చేసినవే)
నీతి లేని దానివి అయినవే పెండ్లామా
నీ ఎత్తు తప్పిన పోకడవయ్యినవే
(నీ ఎత్తు తప్పిన పోకడవయ్యినవే)
_____________________
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
గానం మరియు లిరిక్స్: తరుణ్ సైదుల్ (Tharun saidul)
కోరస్: స్రగ్వి (Sragvi), స్నికిత (snikitha), సహస్ర (sahasra)
దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: రాజు అలువాల (Raju aluvala)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.