పడిపోయా నీ ప్రేమలోనే
నిన్ను చూసి చూడంగానే
నాలాగే నేనంటూ లేనే
నీ చూపు తాకంగానే
అరెరే నీ కళ్ళు మెరిసే మినుగుళ్ళు
కదిలే పాదాలు నదిలో పరవళ్ళు
ఫరియా నీకోసం నా మనసే ఇస్తున్నా
ఫరియా నీకోసం నే ఎదురే చూస్తున్నా
నిన్ను కలిసేదెప్పుడెప్పుడని ఎదురు చూస్తుంటే
కనులకే ఇక కనబడకని దారులు ముస్తావే
నిన్ను పిలిచేదెప్పుడెప్పుడని ఆలోచిస్తుంటే
అనవసరపు కలలని కనవద్దని అంటావే
చెయ్యని తప్పుకి శిక్షలు వెయ్యడం
అస్సలు న్యాయమే కాదులే మరి
తెలిసో తెలియకో చెలి నీ మనసుని
నే నొప్పించితే క్షమించవే మరి
ఫరియా నీకోసం నే పరుగే తీస్తున్నా
ఫరియా నీకోసం నే ఎదురే చూస్తున్నా (చూస్తున్నా)
అడుగడుగున నీ తలపులే పరుచుకున్నలే
ప్రతి నిమిషము నీ పేరునే తలుచుకున్నలే
నా ప్రేమని అలుసుగా మరి నువ్వు చూస్తుంటే
ఆ దిగులుతో గడిగడి నిను దూరం పెట్టాలే
ఏదో తెలియని కోపంలో
ఇలా చెస్తున్నానని తెలిసెనిప్పుడే
నా పొరపాటుని మన్నిస్తావని
ఆశగా చూసేనె గుండె చప్పుడే
__________________
నటీనటులు : అభిలాష్ బబ్లూ (Abhilash Babloo), శివాని మహి (Shivani Mahi)
లిరిక్స్ : సురేష్ బనిశెట్టి (Suresh Banisetty)
గాయకులు: అఖిల్ సంజోయ్ (Akhil Sanjoy), కీర్తన శ్రీనివాస్ (Keerthana Srinivas)
సంగీతం: మోహన్ నాని కర్రా (Mohan Nani Karra)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.