Home » ఈడు మగడేంట్రా బుజ్జి సాంగ్ లిరిక్స్ Naari – The Women

ఈడు మగడేంట్రా బుజ్జి సాంగ్ లిరిక్స్ Naari – The Women

by Lakshmi Guradasi
0 comments
Eedu Magadentra Bujji song lyrics NAARI - The Women

ఈడు మగడంట్రా బుజ్జి ?
హా జోక్ ఏసాడు చూడు
ఈడు మగడంట్రా బుజ్జి ?
వీడు వేషాలు

ఈడు మగడేంట్రా బుజ్జి ?
అదే కదా బాబాయ్
ఈడు మగడేంట్రా బుజ్జి ?
అది తేల్చేద్దాం పద ఎహే

ఈడు మగడంట్రా బుజ్జి ?
హా జోక్ ఏసాడు చూడు
ఈడు మగడంట్రా బుజ్జి ?
వీడు వేషాలు ఏంటో

ఈడు మగడేంట్రా బుజ్జి ?
అదే కదా బాబాయ్
ఈడు మగడేంట్రా బుజ్జి ?
అది తేల్చేద్దాం పద ఎహే

వీడి చెల్లి దేవత అంట
ఆడి చెల్లి ఐటమ్ అంట
మగతనం మీనింగే మార్చేసి మగాడంట
తాగుడంట వాగుడంట భార్యల్ని కొట్టుడంట
భార్య పైన చేయ్యేనేత్తే వీడు పెద్ద మగాడంట

దేవత అంట పూజలంట
పూజ చేసి మొక్కుడంట
దేవతని చూసే చూపు గుడి ఆవల మారునంట
వండి వంట పెట్టాలంట
పనులు చేస్తూ మొత్తం ఇంట
ఈడూ మాస్టర్ ఛెఫ్ లాగా రివ్యూలు చెప్పేనంట

విడి పైన సారు అంట
విడి పైన అరిచానంట
అమ్మ అలీ పైన మంట
ఇంటికొచ్చి చూపేనంట
ఫోన్లోని బార్ లోని గంట్ల సోది వాగుడంట
ఇంట్లోని ఆడాలతో మాట మంచి ఉండదంట

నొపినిచ్చి కయ్యమానవ్ నొప్పి పుడితే అమ్మ అంటావ్
అమ్మ వయసు పెరిగేసరికి కొట్టి నువ్వు కసురుకుంటవ్

ఆడాళ్ళని బొమ్మ చేసి ఆడేవాడు మగాడంట
మగతనం మీనింగే మార్చేసి మగాడంట

ఈడు మగడంట్రా బుజ్జి ?
హా జోక్ ఏసాడు చూడు
ఈడు మగడంట్రా బుజ్జి ?
వీడు వేషాలు

ఈడు మగడేంట్రా బుజ్జి ?
అదే కదా బాబాయ్
ఈడు మగడేంట్రా బుజ్జి ?
అది తేల్చేద్దాం పద ఎహే

ఓ మాట చెప్పు బాబాయ్
అసలు మగాడంటే ఎవడు
ఆ మగతనం అంటే ఏంటి ?
నేను చెప్పనా బాబాయ్ నువ్వేం చేస్తున్నావో
నేను చెప్తా బాబాయ్ మగాడంటే ఎవడో

చూస్తే నిన్ను భయం కాదు రావాలిరా దైర్యం
నీ చూపులో ప్రేమ నింపు కారుతుంది కామం
అర్ధం కాలే విషయం చెప్పు మీకే పోయే కాలం
వావి వరసలు వదిలేసి అదేం పాడు ఆనందం

ఓరయ్య ఇన్స్టాలో స్టోరీలు
లేడీస్ పై కొటేషన్లు
ఇంటర్నెట్ బయటకు వస్తే
చేసేవన్నీ రోట్ట పనులు

ముసలొల్లే గాని మహానుభావులు
మహానుభావుల్లో కొందరున్నారు ఏదవలు
మనవరాలి వయసున్న పిల్లలపై మృగాళ్ళు
పిల్లలకి స్కూలోని చెప్పమంటే పాఠాలు
కొందరి ఎదవలేస్తారు పాడు ఎర్రి వేషాలు

ఈడు మగడంట్రా బుజ్జి ?
హా జోక్ ఏసాడు చూడు
ఈడు మగడంట్రా బుజ్జి ?
వీడు వేషాలు

ఈడు మగడేంట్రా బుజ్జి ?
అదే కదా బాబాయ్
ఈడు మగడేంట్రా బుజ్జి ?
అది తేల్చేద్దాం పద ఎహే

ఓ మాట చెప్పు బాబాయ్
అసలు మగాడంటే ఎవడు
ఆ మగతనం అంటే ఏంటి ?
నేను చెప్పనా బాబాయ్ నువ్వేం చేస్తున్నావో
నేను చెప్తా బాబాయ్ మగాడంటే ఎవడో

మగతనం అంటే మగాడికంటే
కొంచెం బలం తక్కువని
ఆడాళ్ళని కొట్టి హింసించి
నీకు ఇష్టం వచ్చినట్టు
ఆడుకునే బొమ్మల తయారు చేసి
జీవితాంతం నీ కాళ్ళ కింద పడేసి
సేవ చేయించడం కాదు బాబాయ్

మగతనం అంటే ఒక నాన్న గా చూపించాల్సిన ప్రేమ
ఒక అన్నగా తీసుకోవాల్సిన బాధ్యత
ఓక తమ్ముడిగా ఇవ్వాల్సిన గౌరవం
బాబాయ్ ఇప్పుడు చేప్పిందంతా మనలాంటోళ్ల కోసమే
అంటే మగాళ్లని చెప్పుకు తిరిగే మగాళ్ళ కోసం
ఏం చూస్తున్నావ్ ఒకసారి నీతోటి ఆడదాని కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
తన కళ్ళలో నీకు నువ్వు కనపడితే నువ్ మగాడివే బాబాయ్
ఇంకేంటి లేటు కొటేషన్లు పెడతావుగా తెల్లార్లు జామునే
రెస్పెక్ట్ ఉమెన్ ఇది అది అంటూ
ఇప్పుడు పెట్టు మగాడివి అనిపించుకో ఎహే
ఉంటాను మరి నమస్తే నమస్తే ..

వీడు మగాడేరా బుజ్జి
వీడు మగాడేరా బుజ్జి
ఏమంటావ్ చెప్పు నువ్వు మగాడివే కదూ ఆ.. ఆ
వీడు మగాడెరోయ్

_____________________

సాంగ్ : ఈడు మగడేంట్రా బుజ్జి (Eedu Magadentra Bujji)
ఆల్బమ్ పేరు: నారీ – ది ఉమెన్ (Naari – The Women)
గాయకుడు మరియు పాటల రచయిత: సి షోర్ (C SHOR)
సంగీత దర్శకుడు: వినోద్ కుమార్ విన్ను (Vinod Kumar Vinnu)
నటినటులు: CSHOR, నిత్యశ్రీ (Nitya Sree) & కార్తికేయ దేవ్ (Karthikeya Dev)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.