Home » నల్ల జిలకర మొగ్గ (Nala Jilakara Mogga) సాంగ్ లిరిక్స్ గరివిడి లక్ష్మి

నల్ల జిలకర మొగ్గ (Nala Jilakara Mogga) సాంగ్ లిరిక్స్ గరివిడి లక్ష్మి

by Lakshmi Guradasi
0 comments
Nala Jilakara Mogga song lyrics Garividi Lakshmi

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
రూపాయి కావాలా
రూపాయి పువ్వులు కావాలా ?
రూపాయి కావాలా
రూపాయి పువ్వులు కావాలా ?

నా రూపు రేఖ సల్లగుంటే..
అ.. ఎలగా ?
మావ.. నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
రూపాయి పువ్వులెందుకు

ఆహా !
నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
రూపాయి పువ్వులెందుకు
అవును

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
రూపాయి కావాలా
రూపాయి పువ్వులు కావాలా ?
అవును అవును
రూపాయి కావాలా
ఆహా !
రూపాయి పువ్వులు కావాలా ?

నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
నాకు పువ్వులెందుకు

ఓహో
నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయి ఎందుకు
నాకు పువ్వులెందుకు
అవునా

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ

పావలా కావాలా ?
పావలా సిల్లర కావాలా ?
పావలా కావాలా ?
పావలా సిల్లర కావాలా ?

నా పాదాలు సల్లగుంటే…
ఆ.. ఏటి సల్లగుంతే..

నా పాదాలు సల్లగుంటే
పావలెందుకు నాయినా సిల్లరెందుకు
అయ్యా నా పాదాలు సల్లగుంటే
పావలెందుకు నాయినా సిల్లరెందుకు

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
సిరలు కావాలా?
సిల్కు సిరలు కావాలా ?
సిరలు కావాలా?
సిల్కు సిరలు కావాలా ?

సిరిగల నీ ముఖము జూస్తే సిరలేందుకు
మావ.. సారెలెందుకు
ఆహా!
సిరిగల నీ ముఖము జూస్తే సిరలేందుకు
మావ.. సారెలెందుకు
అదే

నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నల్ల జిలకర నా నల్ల జిలకర మొగ్గ
నా నల్ల జిలకర మొగ్గ నా నల్ల జిలకర మొగ్గ
నా నల్ల జిలకర మొగ్గ….

__________________________

సాంగ్ : నల్ల జిలకర మొగ్గ (Nala Jilakara Mogga)
చిత్రం: గరివిడి లక్ష్మి (Garividi Lakshmi )
సంగీతం: చరణ్ అర్జున్ (Charan Arjun)
పాట మూలం : ఉత్తరాంధ్ర జనపదాలు (Uttarandhra Janapadalu )
అదనపు సాహిత్యం: జానకిరామ్ (JanakiRam)
గాయకులు: అనన్య భట్ (Ananya bhat), జానకిరామ్ (JanakiRam)మరియు గౌరీ నాయుడు జమ్ము (Gowri Naidu Jammu)
నటీనటులు: ఆనంది (Anandhi), రాగ్ మయూర్ (Rag Mayur)
నిర్మాతలు: T.G. విశ్వ ప్రసాద్ (T.G. Vishwa Prasad), టి.జి. కృతి ప్రసాద్ (T.G. Krithi Prasad)
దర్శకత్వం: గౌరీ నాయుడు జమ్ము (Gowri Naidu Jammu)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.