అడగవా అడగవా నిజం ఏమైందో
చివరగా మిగిలిన గతం కానుందో
తన ఉసేదని అలిగిందా మరి
నిలువెల్లా నదై తడిపిందా మది
వదిలేసింది ప్రాణాన్ని నా ఊపిరి
హృదయమా హృదయమా శిధిలమైయావా
ప్రియతమా ప్రియతమా మరచిపోయావా
ప్రేమ ఆ…
హృదయమా హృదయమా
ప్రియతమా ప్రియతమా
కనుల కందని కలలు వేరని మనసుకేం తెలుసే
పలకరించని కులుకు ఏదని కలలు నన్నడిగే
ఎదురుచూపుల దరికి రానని గురుతుగా నిలిచే
కుదురు కోరిన ఎదని కాదని కలహమయ్యావే
నీ స్నేహం ఈ బంధం కలకాలాలను దాటినా
నా వెంటే ఆనందం మరిలేదే..
మనసు వెతికే చెలిమి కోసం మదనమవసరమా
మమత దొరికే ప్రేమ దరికే కథల చిరునామా…
వెన్నెలైన వాలిపోదా మొదటి వేకువ జాముకే
మంచులాగా కరిగి పోదా రవికి దొరకని చీకటే
వెన్నెల ఓ నిన్నలా నాతోనే ఉంటావా
నడిరేయిలా ఉదాయాలకే దూరంగా వెళ్తావా
తెలియదా తెలియదా పయనమెందాకో
ఈ తడబడే అడుగులే గమనమయ్యెనో
నీ జంటే మరి నేనుంటానని
మరుజన్మే సరి మన బంధాలకి
విడిపోనంది నీ చెయ్యి నా ఊపిరి
హృదయమా హృదయమా మేలుకోగలవా
ప్రియతమా ప్రియతమా తిరిగిరాగలవా
ప్రేమ ఆ…
సహనమైన ఓడిపోదా సమయమాడే ఆటలో
బరువు మోసినా కన్నులకేమో తెరల మౌనం ఏమిటో
పసిడి పలుకుల లాలీ పాటకి పరవసించని కాలమా
ఉసురు తగిలిన హృదయ వేదన తరలిపోదని కోపమా
ప్రణయమా నా ప్రణయమా దయలేని దారుణమా
ఇక ఒంటరై ఏకాకినై మిగిలాను నీ రుణమా….. ఆ.. ఓ
ప్రేమ …. ఆ ప్రేమ
______________________
సాంగ్ – రాధా రిషి (Radha Rishi)
గాయకులు – కార్తీక్ (Karthik) మరియు లక్ష్మి మేఘన (Lakshmi Meghana)
లిరిక్స్ – శ్రీ అన్నప్రగడ (Sri Annapragada)
సంగీతం : – K.V భరద్వాజ్ (K.V Bharadwaj)
నటీనటులు – ఫణి శివరాజు (Phani Sivaraju), కుశిత కల్లపు (Kushitha Kallapu) మరియు లక్ష్మి తేజ SG (Lakshmi Theja SG)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.