Home » నువ్వు సింహమే (Nuvu Simhame) సాంగ్ లిరిక్స్ AGR

నువ్వు సింహమే (Nuvu Simhame) సాంగ్ లిరిక్స్ AGR

by Lakshmi Guradasi
0 comments
Nuvu Simhame song lyrics AGR

జనమే పొగిడే ముఖమే వద్దంటావే
ఓడిపోయి గెలిచే రణమే తెమ్మంటావే
నీ పేరు మాపే మదగజములనే ఎదురించావో
నువ్వు సింహమే…

అలా ఆకాశం అంచులు సరిపోని గువ్వే
నది అద్దంలో తన రూపం చూడగా నవ్వే
ఆకులపై వాలే హిమబిందువు తీర్చే
ఆ గువ్వ మోసేటి సంద్రమంత దాహం
నిప్పును తుంచావో రెండుగ మండేగా
వీడు నిప్పు ఒకటేగా….

అలా ఆకాశం అంచులు సరిపోని గువ్వే
నది అద్దం లో తన రూపం చూడగా నవ్వే
ఆకులపై వాలే హిమబిందువు తీర్చే
ఆ గువ్వ మోసేటి సంద్రమంత దాహం

ఏ గుడిలోన రధమల్లె జీవితమనుకో
ఎవరైనా ప్రేమగ లాగగ ముందుకుపో
పూవు తావి పంచoగ వాడే
ఎదురురాశించని సాయం వీడే
ఈ గాలికి సంకెల్లే వేయగ తరమా
గుప్పెట నీరు నలా ఆపి చూపుమా…
ఓ… ఓ… ఓ…..

అలా ఆకాశం అంచులు సరిపోని గువ్వే
నది అద్దంలో తన రూపమ్ చూడగ నవ్వే
ఆకులపై వాలే హిమబిందువు తీర్చే
ఆ గువ్వ మోసేటి సంద్రమంత దాహం

సొంతం నీకిక ఎవరని అడగగ
జనమంత కలుపుతారు వరసే
కొందరి పేర్లనే చరితే ప్రేమగా
కాలాలే దాటైనా మోసే
అది ఎవరిధి అని ఎవరు చెప్పె వీలే లేదంట
ఆ పేరే నీదైతే దైవం ఉంది నీవెంట

ఏ ఖ్యాతైనా బలమైన నీదనుకోక
జ్ఞానమ్ అను మకుటం చూడవు నువ్ కడదాకా
సూర్యుని తేజముకే రగిలే జాబిల్లి
పంచే వెన్నల చలువే మాదేవని
నిప్పుని తుంచావో రెండుగ మండేగా
వీడు నిప్పు ఒకటేగా…

_________________________

సాంగ్ – నువ్వు సింహమే (Nuvu Simhame)
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ (A.R.Rahman )
లిరిక్స్ – రాకేండు మౌళి (Rakendu Mouli )
నటుడు: సిలంబరసన్ TR (Silambarasan TR)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.

error: Content is protected !!