ఏదేమైనా సఖి విడువను నిన్నే
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే
యేలే సూర్యుని మీన జాబిలి మీన
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే
ఒక పాపగ నిన్నే కను పాపగ నిన్నే
కాచుకుందుకై బాసలు సేయుచుంటినే
జ్ఞాపకమే రారిక కన్న వారైనా
కలనైనా తలవను ఏ కన్నెనైనా
చిట్టి గొలుసు చప్పులకు చెంతకు రానా
గుట్టుకి ఒక ముద్దునొసగి బానిస కానా
నువ్వడిగే ఏ వరమైనా భారము కాదే
మన నడుమన ఏ వాదమైన ఓటమి నాదే
ఏదేమైనా సఖి విడువను నిన్నే
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే
యేలే సూర్యుని మీన జాబిలి మీన
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే
ఆశ తీరినాక ప్రేమ ఆపుకోనే
అర్ధరాత్రి దొంగనై నీకు బెదురుతానే
నువ్వు ముసలివైన వేల మూడవ కాలవుతా
నలకగుంటే నా ఓడినే పానుపు చేస్తా
ఊపిరిలా నిన్ను చేరి ఆయువు పొస్త
ని వారిని నా వారీగ ఎదలో దాస్థ
నీ కల నిజమవటానికి నను బదులిస్తా
నీ క్షేమం కోసం అయితే ప్రాణాలిస్తా
ఏదేమైనా సఖి విడువను నిన్నే
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే
యేలే సూర్యుని మీన జాబిలి మీన
ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే
ఒక పాపగ నిన్నే కను పాపగ నిన్నే
కాచుకుందుకై బాసలు సేయుచుంటినే
కాచుకుందుకై బాసలు సేయుచుంటినే
కాచుకుందుకై బాసలు సేయుచుంటినే
________________________
సాంగ్ – ఏదేమైన సఖి (Yedemaina Sakhi)
చిత్రం – విక్రమసింహ (Vikramasimha)
గాయకుడు – పి. ఉన్నికృష్ణన్ (P. Unnikrishnan)
సంగీతం – ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman)
లిరిక్స్ – అనంత శ్రీరామ్ (Anantha Sriram)
నటీనటులు – రజనీకాంత్ (Rajinikanth)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.