ఎందుకే సచ్చేముందు చెప్పలేదే నాతో
సెప్పితే నీతో పాటు సచ్చిపోదు నేనే
కనిపించకుండా కనపడనంత దూరానికెళ్ళినవే
ఎదిరించకుండా నీవాళ్ళనంతా నువ్వెళ్ళిపోయినవే
కారణాలు ఏమైనా కారకులైనరే మనవాళ్ళు
నమ్మలేక పోతున్నానే నువ్వే లేవనే నిజాన్ని
సెప్పలేకపోతున్నానే నువ్వే రావనే పదాన్ని
నమ్మలేక పోతున్నానే నువ్వే లేవనే నిజాన్ని
సెప్పలేకపోతున్నానే నువ్వే రావనే పదాన్ని
కంటికి రేప్పొలే కాపాడే నీ వాళ్లే
నిన్ను లేకుండా చేశారా నన్నే ప్రేమించితే
అప్పుడే నూరేళ్లు నిండేనా నీకంటే
ఎటు కాకుండా చేశారా నిన్నే జన్మించితే
తప్పు సేయనేలేదే మనమిక కలిసి ఉండనీయలేదులే కథలో
అడ్డు సెప్పనేలేదులే మనమిక కలిసి సావనీయలేదులే జతలో
అయిన నువ్వు లేకుండా నేనే ఉంటానా
నమ్మలేక పోతున్నానే నువ్వే లేవనే నిజాన్ని
సెప్పలేకపోతున్నానే నువ్వే రావనే పదాన్ని
నమ్మలేక పోతున్నానే నువ్వే లేవనే నిజాన్ని
సెప్పలేకపోతున్నానే నువ్వే రావనే పదాన్ని
నీ బొంద నా బొంద పక్కనే ఉండాలే
అది సూసైనా ఏడ్వాలే తల్లిదండ్రులే
ఆత్మ హత్యలే మనవే అంటుంటే
అది తప్పని చెప్పాలే మన ఆత్మలే
విడదీసినామనుకున్నారే తెలువక
సచ్చి గెలిపించుకున్నామే ప్రేమని
మల్లొక జన్మంటూ ఉంటెనే తప్పక
పుట్టి బతికించుకుందామే ప్రేమను
దేవుడు ఓర్వలేకుండా చేసే ఉంటాడా…
నమ్మలేక పోతున్నానే నువ్వే లేవనే నిజాన్ని
సెప్పలేకపోతున్నానే నువ్వే రావనే పదాన్ని
నమ్మలేక పోతున్నానే నువ్వే లేవనే నిజాన్ని
సెప్పలేకపోతున్నానే నువ్వే రావనే పదాన్ని
___________________
లిరిక్స్ – కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: నాగరాజ్ పెర్కా
గాయకుడు: హన్మంత్ యాదవ్
సంగీతం: ఇంద్రజిత్
నటీనటులు: నజీమ్ థాషు, వణ్య అగర్వాల్, జగదీష్, ధనలక్ష్మి, రాజు, లావణ్య, భాస్కర్, సౌందర్య, దేవేందర్
నిర్మాత: క్షీరసాగరం సిద్ధార్థ్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.