ఏ కమ్మలంటూ కాటుకంటూ
ఎంట ఎంట రాకురో రాకురో నాయి బావ
ఎంబడి ఎంబడి రాకురో రాకురో నాయి బావ
ఏ మంది చూస్తే నిందతోని
రందే నాకు కాదురో కాదురో నాయి బావ
ఎంట ఎంట రాకురో రాకురో నాయి బావ
ఏ ఊరి తోడు ఊట తోడు మాట తోడు మల్లె తోడు
నిన్ను చూడకుండనో మరదలో నాగమణి
మాటలాడకుండనో మరదలో నాగమణి
నిన్ను చూడకుండనో మరదలో నాగమణి
మాటలాడకుండనో మరదలో నాగమణి
పొంగా రాంగా తోవలల్లా
బండి ఆపి నవ్వకో నవ్వకో నాయబావ
బండి ఆపి నవ్వకో నవ్వకో నాయబావ
మా ఇంటి ముందు చిట్టితోని
రాయబారం నడపకో నడపకో నాయిబావ
రాయబారం వొద్దురో వద్దురో నాయిబావ
ఏ అవ్వ తోడు బువ్వ తోడు నా తోడు నింగి తోడు
మనసంతై గత్తరో మరదలో నాగమణి
నువ్వు చూస్తే నిమ్మలం మరదలో నాగమణి
మనసంతై గత్తరో మరదలో నాగమణి
నువ్వు చూస్తే నిమ్మలం మరదలో నాగమణి
మా ఇంటి ముందు మా పార్టీలి
ముచ్చట్లన్నీ ఆపురో ఆపురో నాయిబావ
ఇంటి ముఖాన చూడకో చూడకో నాయిబావ
మంది కంట్ల మన్నుపడ
ఎప్పుడు నా మీద కన్నురో కన్నురో నాయిబావ
ఎప్పుడు నా మీద కన్నురో కన్నురో నాయిబావ
నిన్ను కలవకుండా పిలవకుండా చూడకుండా
మాట వినక గడియన్నన్నా గడవదో మరదలో నాగమణి
మంకు మానవో పట్టు మానవో మరదలో నాగమణి
గడియన్నన్నా గడవదో మరదలో నాగమణి
మంకు మానవో పట్టు మానవో మరదలో నాగమణి
అయ్యో అద్దుమా రాతిరి నిద్దురమాని ఆలోచిస్తూ ఉండకో
ఉండకో నాయిబావ ఆలోచిస్తూ ఉండకో నాయిబావ
ఎలాకింత తిండి తిని
కంటి నిండా నిద్దురపో నిద్దురపో నాయిబావ
ఎన్నటికైనా నీదాన్నిరో దాన్నిరో నాయిబావ
ఈ మాటకు మనసు కొరకు రాక కొరకు తోడు కొరకు
పస్తులున్న గాని నేను మరదలో నాగమణి
పసి పాప లెక్క సాదుకుంటనే నాగమణి
పస్తులున్న గాని నేను మరదలో నాగమణి
పసి పాప లెక్క సాదుకుంటనే నాగమణి
________________________
లిరిక్స్ & ట్యూన్: రాజ్ కుమార్ పోగుల (Raj Kumar Pogula)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
గానం : బొడ్డు దిలీప్ (Boddu Dilip) – ప్రభ (Prabha)
నటీనటులు : చిన్ను ( సుబ్బి సుబ్బడు ) Chinnu ( Subbi Subbadu ) – మౌనిక డింపుల్ (Mounika Dimple)
దర్శకత్వం & కొరియోగ్రాఫర్: పైండ్ల రాజేష్ (Paindla Rajesh)
నిర్మాత: ఇ ప్రశాంత్ (E Prasanth)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.