Home » జాబిల్లి రావే వెండి జాబిల్లి సాంగ్ లిరిక్స్ అందాల రాముడు

జాబిల్లి రావే వెండి జాబిల్లి సాంగ్ లిరిక్స్ అందాల రాముడు

by Lakshmi Guradasi
0 comments
Jabilli Ravve song lyrics Andala Ramudu

జాబిల్లి రావే వెండి జాబిల్లి
నీతోనే ఉంటానమ్మా జాబిల్లి
నిన్నే కోరిందీ వెండి జాబిల్లి
నీతోడై ఉంటానంది మనసిచ్చి
మబ్బుల్లో దాగి దోబూచి ఆడి
నాముందే ఉంటూ నమనసే దోచి
నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి

నిన్నే కోరిందీ వెండి జాబిల్లి
నీతోనే ఉంటానమ్మా జాబిల్లి

దూర దూర ఈడు తోడు లేక నేడు
ఉసురుసురన్నది చూడు కోరిందే నీతోడు…
కొంటె కళ్ళ చూపు గుచ్చుకున్న నాడు
రేగదామరి జోడు ఆగదే ఎద తూరు
నా వెంటె చెలి నీవుంటే ఇంకేవి కోరనులే
అవునన్నా నువు కాదన్నా నేనీలో సగమేలే
ఆ.. మాటే చాలమ్మా నీ నీడై ఉంటాలే

నిన్నే కోరిందీ వెండి జాబిల్లి
నీతోనే ఉంటానమ్మా జాబిల్లి

వెన్నెలంటి నువ్వు వెన్నపూస మనసు
చూసి నీలో నేను చేరువయ్యా నీకు
పాలరాతి బొమ్మపైడి పూల కొమ్మ
దేవతంటే ఎవరో చూశాను నీలో నేడు
బతుకంతా నీ జతగా ఉండే వరమే ఇచ్చావే
బడిలో చదివే ఆనాడే నా ఎదలో చేరావే
నీ ఒడిలో గువ్వల్లె కలకాలం ఉంటాలె

_________________________

పాట: జాబిల్లి రావే (jabilli rave)
చిత్రం: అందాల రాముడు (Andhala Ramudu)
తారాగణం: ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal), సునీల్ (Sunil)
సంగీత దర్శకుడు: S. A. రాజ్‌కుమార్ (S. A. Rajkumar)
గీతరచయిత: ES మూర్తి (ES Murthy)
గాయకులు: రాజేష్ (Rajesh), శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.

error: Content is protected !!