Home » హైలో హైలెస్సారే (Hailo Hailessare) సాంగ్ లిరిక్స్ శతమానం భవతి

హైలో హైలెస్సారే (Hailo Hailessare) సాంగ్ లిరిక్స్ శతమానం భవతి

by Lakshmi Guradasi
0 comments
Hailo Hailessare song lyrics Shatamanam Bhavati

గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిల్లు
ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు

కన్నె పిల్లల కోర్కెలు తీర్చే
వెన్నాలయ్యకు గొబ్బిల్లు
ఆ వెన్నాలయ్యకు గొబ్బిల్లు

ముద్దులగుమ్మ బంగరు బొమ్మ
రుక్మిణమ్మకు గొబ్బిల్లో
ఆ రుక్మిణమ్మకు గొబ్బిల్లు

గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిల్లు
ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు

హైలో హైలెస్సారే హరిదాసులు వచ్చారే
దోసిట రాసులు తేరే కొప్పును నింపేయ్రే
డూడూ బసవడు చూడే వాకిట నిలుచున్నాడే
అల్లరి చేస్తున్నడే సందడే మొనగాడె

కొత్త అల్లుళ్ళ అజమాయిషీలే
బావ మరదళ్ల చిలిపి వేషాలే
కోడి పందేల పరవల్లే
తోడు పేకాట రాయుల్లే
వాడ వాడంతా సరదాల చిందులేసేలా ..

హే భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే

హే ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే..

హే భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే

హే ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే..

మూనాళ్ల సంబరమే ఉత్సవమే
ఏడాది పాటంతా జ్ఞాపకమే
క్షణం తీరిక క్షణం అలసట
వశం కానీ ఉత్సాహమే

రైతు రారాజుల రాతలే మారగా
పెట్టు పోతలతో అందరికి చేయూతగా
మంచి తరుణాలకే పంచ పరమాణ్ణమే
పంచి పెట్టెల మనలోని మంచి తనమే

హే భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే

హే ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే…

హే భగ భగ భగ
గణ గణ గణ గణ
కణ కణ కణ కణ

హే భగ భగ భగ భగ
గణ గణ గణ గణ
హే ధగ ధగ ధగ ధను సూర్యుడే

రోకళ్ళు దంచేటి ధాన్యాలే
మనసుల్ని నింపేటి మాన్యాలే
స్వరం నిండుగా సంగీతాలుగా
సంతోషాలు మన సొంతమే

మట్టిలో పుట్టిన పట్టు బంగారమే
పెట్టి చేసారు మన చిన్ని హృదయాలనే
సాన పెట్టేయిలా కోరుకుంటే అలా
నింగి తారల్ని ఈ నెలలో పండించేలా

హే భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే

హే ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే…

హే భగ భగ భగ భగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కణ కణ కణ కణ కిరణ కాంతులే

హే ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే
చక చక చక చక మకర రాశిలో
మెరిసే మురిసే సంక్రాంతే…

_________________________

పాట పేరు: హైలో హైలెస్సే (Hailo Hailessare)
సినిమా పేరు: శతమానం భవతి (Shatamanam Bhavati)
నిర్మాత: దిల్ రాజు (Dil Raju)
దర్శకుడు: వేగేశ్న సతీష్ (Vegesna Satish)
సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
గాయకులు: ఆదిత్య అయ్యంగార్ (Aditya Iyengar), రోహిత్ పరిటాల (Rohith Paritala), మోహన భోగరాజు (Mohana Bhogaraju), దివ్య దివాకర్ (Divya Divakar)
లిరిక్స్ : శ్రీమణి (Srimani)
నటుడు: శర్వానంద్ (Sharwanand)
నటి : అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.