అలికి పెట్టిన ముగ్గు తళతళ మెరిసింది
తుమ్మెద ఓ తుమ్మెద
మురిపాల సంక్రాంతి ముంగిట్లోకొచ్చింది
తుమ్మెద ఓ తుమ్మెద
గొబ్బియ్యల్లోగొబ్బియ్యల్లో చలిమంట వెలుగుల్లూ
తుమ్మెద ఓ తుమ్మెద
సంక్రాంతి వచ్చిందే తుమ్మెద
సరదాలు తెచ్చిందే తుమ్మెద
కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా… ఆ ఆఆ… పేరంటం
ఊరంతా… ఆ ఆఆ… ఉల్లాసం!
కొత్త అల్లుళ్లతో కొంటె మరదలతో పొంగే హేమంతసిరులు
గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో
గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో
మంచి మర్యదని పాపా పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు
న్యాయం మా శ్వాసని ధర్మం మన బాటని చెపుతాయి స్వాగతాలు
బీద గోపోళ్ళనే మాట లేదు
నీతి నిజాయితీ మాసీ పోదు
మచ్చ లేని మనసు మాది
మంచి తెలుసు మమత మాది
ప్రతి ఇల్లో బొమ్మరిల్లు..
సంక్రాంతి వచ్చిందే తుమ్మెద
సరదాలు తెచ్చిందే తుమ్మెద
పాటే పంచామృతం మనసే బృందావనం
తడిపేనే ఒళ్లు జల్లు
మాటే మకరందము చూపే సిరి గంధము
చిరునవ్వే స్వాతి జల్లు
జంట తలళాతో మేజువాణి
జోడు మద్దెళ్ళనీ మోగిపోనీ
చెంతకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే
వయసే అల్లాడిపోయే…
సంక్రాంతి వచ్చిందే తుమ్మెద
హొయ్ సరదాలు తెచ్చిందే తుమ్మెద
హొయ్ కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతుంటే
ఇంటింటా… ఆ ఆఆ… పేరంటం
ఊరంతా… ఆ ఆఆ… ఉల్లాసం!
కొత్త అల్లుళ్లతో కొంటె మరదలతో పొంగే హేమంతసిరులు
_________________________
చిత్రం : సోగ్గాడి పెళ్లాం (Soggadi Pellam)
లిరిసిస్ట్: భువన చంద్ర (Bhuvana Chandra)
గాయకుడు: S. P. బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam)
మహిళా గాయని: K. S. చిత్ర (K. S. Chithra)
నటుడు : మోహన్ బాబు (Mohan Babu)
నటి: రమ్య కృష్ణన్ (Ramya Krishnan)
దర్శకుడు: ముత్యాల సుబ్బయ్య (Muthyala Subbaiah )
సంగీతం: సాలూరి కోటేశ్వరరావు (Saluri Koteswara Rao )
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.