ఆకాశ మేడపై దుఃఖంగా కూర్చున్న వెన్నెలమ్మా
చిన్నంగా కన్ను తెరిసి చిన్నబోయి చూస్తున్నావెందుకమ్మా
కోరుకున్న వాడు కానరాక నువ్వు జాబిలమ్మా
కన్నీటి చుక్కకే శాశ్వతమైతున్నవెందుకమ్మా
ఒంటరాయే సందమామ తన తోడు ఎవరు లేక
తారల తోటలో ఓడుతున్న ప్రేమలోన
గుబులు చెందుతున్నదమ్మా
తను కోరుకున్నోడే దూరమైతడని
బాధను మోస్తున్నదమ్మా
నీ జాడకై ఎదురు చుస్తున్ననే
పిచ్చివాడినై తిరుగుతున్ననిలా
నీ తోడునే తలచుకుంటున్ననే
నువ్వు దూరమైతే గుండె ఆగిపోదా
నువ్వే కావాలంటూ జతగా రావాలంటూ
ఎవరు ఎదురొచ్చినా మానువాడలంటూ
చావుకైనా వాడు ఎదురెళ్ళేలాగా ఉన్నాడే
ఆకాశ మేడపై దుఃఖంగా కూర్చున్న వెన్నెలమ్మా
చిన్నంగా కన్ను తెరిసి చిన్నబోయి చూస్తున్నావెందుకమ్మా
కోరుకున్న వాడు కానరాక నువ్వు జాబిలమ్మా
కన్నీటి చుక్కకే శాశ్వతమైతున్నవెందుకమ్మా
ఆ నింగినే ధాటి వచ్చిన నీ చిరునవ్వు ఎడబోయెనే
నీ కనుమరుగైన జ్ఞాపకాలు కంటికి కునికె రానివ్వలేదే
చిన్ననాటి జ్ఞాపకాలు చల్ల చెదురై నన్ను చులకనగా చూసేనే
నువ్వే నా తోడు నీ నీడ నేనన్న మాటకి దూరమైపోతున్నమే
నీ సిరి నవ్వు కోరిన గాని
నీ సిరి సంపదలు కోరలేదే
నీ వెనక నేనుంటున్న గాని
నీ ఎదల చోటు నొసలేదే
అయినా రావాలంటూ జతగా కావాలంటూ
ఎవరు ఎదురొచ్చినా మానువాడలంటూ
నా ప్రేమకై ఎంత దూరమైన పోతానే
ఆకాశ మేడపై దుఃఖంగా కూర్చున్న వెన్నెలమ్మా
చిన్నంగా కన్ను తెరిసి చిన్నబోయి చూస్తున్నావెందుకమ్మా
కోరుకున్న వాడు కానరాక నువ్వు జాబిలమ్మా
కన్నీటి చుక్కకే శాశ్వతమైతున్నవెందుకమ్మా
కారు చీకటే కమ్ముకున్న వేళ
కోరి వస్తున్న నీ తోడునే
పొగమంచు కురవంగా ప్రేమే పగ పట్టంగా
కూలుతూ వస్తున్నానే
ఎదలో ఉన్న నువ్వు నా ఎదురు లేకుంటే
బతికున్న శవమైతినే
ఇద్దరం ఒక్కటని చెప్పిన నీ మాట
గుద్ది నా గుండేనాపే
నిన్ను మనువాడెటోడున్న గాని
నువ్వు మానసిచ్చినోడే లేడే
నువ్వే లేవన్న మాట మరువక
సావు చుట్టమైపోతావున్నానే
చెంత చేరే గడియ రాక
నువ్వే తోడు లేక
మనసులున్న బాధ దిగమింగుకోలేక
ఒంటరిగా ప్రేమలో ఓడిపోతున్నానే
ఆకాశ మేడపై దుఃఖంగా కూర్చున్న వెన్నెలమ్మా
నిన్ను మరువలేక నింగి చేరనున్న నా ప్రాణమా
కోరుకున్న వాడే తోడులేక నువ్వు జాబిలమ్మా
కన్నీటి సంద్రంలో మునిగిపోకే ఓ బంగారమా
ఓడుతదా వీరి ప్రేమ మరి ఓటమికే మొగ్గు సుపుతావున్నది
కూలుతదా వీరి ప్రేమ వీరిద్దరూ కలిసేలా
ఆ బ్రహ్మ రాత రాసినాడో లేదో
సిన్నీ మాటలతో చెప్పరాదా
_______________________________
సాంగ్ : ఒంటరాయే సందమామ
సంగీత దర్శకుడు : ఇంద్రజిత్ (Indrajitt)
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : మనోజ్ కాసుబోజుల (Manoj Kasubojula)
సాహిత్యం-ట్యూన్: సందీప్ సుద్దాల (Sandeep Suddala)
గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanmath Yadav)
నటి : నీతు క్వీన్ (Nithu Queen)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.