చిన్ని పాణనికెన్నీ గోసలో
మన్ను జన్మానికెన్ని ఆశలో
కన్ను కనిపించే చూపు మేరలో
అన్ని మనకందినట్టే ఉండురో
పెద్ద జడివానలో ఈదుతున్నవురో
అంత సుడిగాలిని ఆపే బలమేదిరో
అడవి తల్లి సళ్ళని గూడులో
ఆడుకున్న అట కోయిల ఆగమాయెనే
మూగబోయెనే ఆగమాయెనే మూగబోయెనే
బంబోలె బం బంబోలె ఇప్పుడే ఆరంభం కాలే
ఆ శివుడాడే ఆటేరా ఇది నీకింకా అర్ధం కాలే
ఈ భూమిపైన ఎవ్వడికాడే పట్టదురయ్యె నీ జోలే
ఆటంకాలే దాటించాక అందిస్తాడు శిఖరాలే
చిన్ని పాణనికెన్నీ గోసలో
మన్ను జన్మానికెన్ని ఆశలో
నీతో పాటే నీలాగా పెరిగి పెద్దవును ధ్యేయం
అది నెరవేరాలంటే నీకు నువ్వేరా సాయం
సదువు చేరాక తీరం జారీ పడుతుంది పాదం అయిన
ఆగొద్దు నువ్వు అందరూ చూసిందే ఆధాయం
మనగందే చెమట చుక్కల్లో మొనగాడైపోవు లెక్కల్లో
అడగందే అమ్మే పెట్టదురో అగ్గిన మరగందే పసిడి పుట్టదురో
ఊరు ఇడిసావురో కుడు మరిసావురో
తోడు నీడ లేని మోడువైనవురో
అడవి తల్లి సళ్ళని గూడు
ఆడుకున్న అట కోయిల ఆగమాయెనే మూగబోయెనే
బంబోలె బం బంబోలె
నవ్వేను నిను చూసి ఊరే
నీ గుండెల రగిలే జ్వాలలు తెలియక
లేస్తుంది ప్రతి నోరే
అమ్మయ్య పెట్టిన అస్సలు పేరే
నీ ఇష్టానికి మారే
కంగారవకు నువ్వు కిందవక
ఇది జంగముడేసిన దారే
మరు మూల గ్రామాన పుట్టిన నీకింత ధీమాన
వెనక ముందేమి లేదు అయిన ఎంది హైరానా
అంటూ ప్రశ్నించే లోకం వచ్చి తీర్చదు నీ శోక
నడిచే నీకు తెలుసుంటే చాలు నీవే పై గమ్యం
ఎదిగిన ప్రతి వాడి కథ చూడు
హేళనతో మొదలై ఉంటాడు
ఇది దాటి నువ్వు గెలిచిన నాడు
లేడంటారు నిన్ను మించినోడు
పడితే ఓటమి కాదు అప్పుడే అయిపోలేదు
ఇంకా పదునై మళ్ళి వేగంగా ఎదురీదు
ఏదో ఉంది దైవకారణం నీకె ఎందుకంటా ఈ రణం
అనుకో చాలురో.. విజయం వాలురో
బంబోలె బం బంబోలె వెనకకు లాగిన బాణాలే
ముందుకు మించి ఘన వేగంతో దూసుకుపోతాయి దురాలే
అందరికేమో ఆనందాలే నీకెందుకు ఈ సమారాలే
నిన్నెంచుకోని తనలుంచుకోని తాండవమాడే శివలీలే
___________________________
పాట పేరు: సిన్న పాణం (Sinna Paanam)
సినిమా పేరు: కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) KCR (Keshava Chandra Ramavath).
గాయకులు: చరణ్ అర్జున్ (Charan Arjun), దీప్తి భోగరాజు (Deepti bhogaraju)
లిరిక్స్ : చరణ్ అర్జున్ (Charan Arjun)
సంగీతం: చరణ్ అర్జున్ (Charan Arjun)
నటీనటులు : రాకింగ్ రాకేష్ (Rocking Rakesh), అన్నన్య కృష్ణన్ (Annanya Krishnan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.