Home » హ్యాపి హ్యాపి  బర్త్ డేలు సాంగ్ లిరిక్స్ సుస్వాగతం 

హ్యాపి హ్యాపి  బర్త్ డేలు సాంగ్ లిరిక్స్ సుస్వాగతం 

by Lakshmi Guradasi
0 comments
Happy happy birthdaylu song lyrics Suswagatham

హ్యాపి హ్యాపి బర్త్ డేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలంద చేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపి ఓ…

హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలంద చేయుమా మిత్రమా

తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటుంది
పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది
బోదపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది
విసుగురాని నా మనసే ఎదురే చూస్తుంది

ప్రేమ కథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్టుడేటు ట్రెండు మాది టొటల్ చేంజ్
పాత నీతులింక మాకు నో ఎక్ష్చేంజ్
ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాలసారమే
శాసనాలు కావు మీకు సలహాలు మాత్రమే
కలను వదలి ఇలను తెలిసి నడుచుకో
హ్యాపి హ్యాపి ఆ…

హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా

మ్యూజిక్కా మేజిక్కా మజా కాదు ఛాలెంజి
బాపూజి బాపూజి భలే గులామాలీజి

నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటె ఏమైనా ఎదురే లేదనమా
నేల విడిచి సామైతే టైం వేస్టురా ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే విజయం నీది సుమా

రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండ ఊరుకుంటె తప్పు కదా
నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
చూడకుండ చెయ్యి వేస్తె నోప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతె పువ్వులింక దక్కునా
లక్షమందకుండ లైఫుకర్ధమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ
హ్యాపి హ్యాపి ఆ…

హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకోగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా
ఆపలేని స్వేచ్చ ఉంది అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్ధం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపి ఓ…

హ్యాపి హ్యాపి బర్తుడేలు మళ్ళీ మళ్ళి చేసుకొగ
శుభాకాంక్షలందచేయుమా మిత్రమా

________________________

చిత్రం: సుస్వాగతం (Suswagatham)
తారాగణం: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దేవయాని (Devayani), రఘువరన్ (Raghuvaran)
సంగీతం: ఎస్ ఏ రాజ్ కుమార్ (S A Rajkumar)
సాహిత్యం: షన్ముఖ శర్మ (Shanmukha Sharma)
గానం: మణికిరణ్ (Manikiran), జయచంద్రన్ (Jayachandram)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.