వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం
నిజంగా… ప్రియంగా
నిరీక్షణే నీకై చేసినానే క్షణమొక యుగమై
నీవు లేని నా పయనమే
నిదురలేని ఓ నయనమే
నిన్నే వెతికి నా హృదయమే అలిసే… సొలిసే
నిన్నే తలచి ఏ రోజున
నిలుపలేక ఆవేదన
సలిపినానే ఆరాధన దిల్ సే… దిల్ సే
వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం
వరంగా నాకోనాడే నువు కనిపించంగా
ప్రియంగ మాటాడానే నే నును వెచ్చగా
ఓ… నా మనసుకి చెలిమైనది నీ హస్తమే
నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే
నీ చూపులు నా ఎద చొరబడెనే
నీ పలుకులు మరి మరి వినబడెనే
నీ గురుతులు చెదరక నిలబడెనే
ఒక తీపి గతమల్లె
నిండు జగతికో జ్ఞాపకం
నాకు మాత్రం అది జీవితం
ప్రేమ దాచిన నిష్ఠురం మదినే తొలిచే
అన్ని ఉన్న నా జీవితం
నీవు లేని బృందావనం
నోచుకోదులే ఏ సుఖం తెలిసే… తెలిసే
వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం
నజీరా లేని లోకం ఓ పెనుచీకటే
శరీరమేగా బేధం ఆత్మలు ఒక్కటే
ఓ… తను శ్వాసగా నను నిలిపెనే నా ప్రాణమే
ఓ… తన ధ్యాసలో స్పృహ తప్పెలే నా హృదయమే
తన రాతకు నేనొక ఆమనిగా
ఒక సీతను నమ్మిన రామునిగా
వనవాసము చేసెడి వేమనగా వేచేను ఇన్నాళ్లు!!
తారవా ప్రణయ ధారవా
దూరమై దరికి చేరవా
మాధురై ఎదను మీటవా మనసే… మనసే
ప్రేమలై పొంగె వెల్లువ
తేనెలే చిలికి చల్లగా
తీగలా మేను అల్లవా దిల్ సే… దిల్ సే
వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం
నిజంగా… ప్రియంగా
నిరీక్షణే నీకై చేసినానే క్షణమొక యుగమై
నీవు లేని నా పయనమే
నిదురలేని ఓ నయనమే
నిన్నే వెతికి నా హృదయమే అలిసే… సొలిసే
నిన్నే తలచి ఏ రోజున
నిలుపలేక ఆవేదన
సలిపినానే ఆరాధన దిల్ సే… దిల్ సే
_________________________
పాట: వరించే ప్రేమ (Varinche Prema)
చిత్రం: మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idhi Rani Roju)
తారాగణం: నిత్య మీనన్ (Nithya Menon), శర్వానంద్ (Sharwanand)
సంగీత దర్శకుడు: గోపీ సుందర్ (Gopi Sunder)
గీత రచయిత: సాహితీ (Sahiti)
గాయకులు: హరిచరణ్ (Haricharan)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.