అర్రే ఎన్నెలమ్మే నేల మీద తానమాడినట్టు
ఆ సింగిడి రంగుల చీర నువ్వే కట్టుకొచ్చినట్టు
గుండెలోన డోలు భాజా నాకు మోగినట్టు
ఆ కోర మీసం తిప్పుకుంటా తిరుగుతావు సుట్టు
ఓ పిల్లో నల్ల నాగులు నీ మీద ఉన్నాయ్ ప్రేమలు
బావయ్య చిన్న రాములు నీ ప్రేమకు నా సలాములు
మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్లో నాగులు
మంజుల పాటలు గాదె పిల్లో నాగులు
నాతోనే ఆటలు గాధ బావ రాములు
మోగెను హారాను నాలో పొద్దుగూకే జాములు
పాల పొద్దువడిసే పట్టా గొలుసు సప్పుడారిసే ]
పిల్లాడే కంట నలుసే చూపులన్నీ కాటా అలిసే
నెమలి వయ్యారంతో కాలు కలిపి ఆట కుదిరే
సైరే సయ్యా అంటూ నీదే చూపు నాకు తగిలే
నీ మీదే పాణం రావేమే పోదాం పిల్లో నాగులు
ఇరువైలో పోతాం మందిలో పాపం అయితది రాములు
నీ పిచ్చి ప్రేమలు
మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్లో నాగులు
తోవెంట చూసావు గాదె కొంటె చూపులు
నాతోనే ఆటలు గాధ బావ రాములు
పెట్టెవు టేపు రికార్డోయ్ వెంకటేషు పాటలు
నీలి నీలి కళ్ళ పిల్ల నిమ్మలంగా నువ్వు నడువే
కత్తెర చూపులవాడ కైపేక్కిస్తే నాకు గుబులే
పుల పుల చీరె పూత పోసిన రైక నువ్వే తొడిగి
ఆగోయ్ బావ నువ్వు మందలిస్తూ మాట గలిపి
ఎంతని చూద్దాం ఎప్పటికైనా ఒక్కటే నాగులు
అడయ్యో నువ్వు మావాళ్లతోని మాటలు రాములు
మనువయ్యే తీరులో
మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్లో నాగులు
మంజుల పాటలు గాదె పిల్లో నాగులు
నాతోనే ఆటలు గాధ బావ రాములు
మోగెను హారాను నాలో పొద్దుగూకే జాములు
_____________________
సంగీత దర్శకుడు: వెంకట్ అజ్మీరా (venkat ajmeera)
సాహిత్యం: తరుణ్ సైదులు (Tharun saidulu)
దర్శకత్వం & కొరియోగ్రాఫర్: పైండ్ల రాజేష్ (Paindla Rajesh)
గాయకుడు: బొడ్డు దిలీప్ (boddu dilip)& శ్రీనిధి (srinidhi)
నటులు: చిన్ను (chinnu)&శ్రీయ (sreeya) (సుబ్బి సుబ్బడు)
నిర్మాత: లక్ష్మణ్ బల్కం (Laxman Balkam)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.