Home » ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా లిరిక్స్ ఆనందం (Male & Female)

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా లిరిక్స్ ఆనందం (Male & Female)

by Lakshmi Guradasi
0 comments
Evaraina epudaina song lyrics anandam

Female లిరిక్స్

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడి రాతిరి తోలి వేకువ రేఖా
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మాది పంపిన లేఖా

గగనాన్ని నేలని కలిపే వీలుందని చూపేలా
ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా
చూసేందుకు అచంగా మన భాషే అనిపిస్తున్నా
అక్షరము అర్ధం కానీ ఈ విధి రాత
కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో
హృదయాలను కలిపే శుభలేఖ

ఓ.. ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా
నడి రాతిరి తోలి వేకువ రేఖా
నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే
ఒక చల్లని మాది పంపిన లేఖా

Male లిరిక్స్

ఎవరైనా ఎపుడైనా సరిగ్గా గమనించారా
చలి చెర అసలెప్పుడు వదిలిందో
ఆణువణువూ మురిసేలా చిగురాశలు మెరిసేలా
తోలి శకునం ఎప్పుడు ఎదురైందో
చూస్తూనే ఎక్కడనుంచో చైత్రం కదిలిస్తుంది
పొగమంచును పోపో మంటూ తరిమేస్తుంది
నెలంతా రంగులు తొడిగి సరికొత్తగా తోస్తుంది
తన రూపం తానె చూసి పులకిస్తుంది
ఋతువేప్పుడు మారిందో బ్రతుకెప్పుడు విరిసిందో
మనసెప్పుడు వలపుల వనమైందో

ఓ.. ఎవరైనా ఎపుడైనా సరిగ్గా గమనించారా
చలి చెర అసలెప్పుడు వదిలిందో
ఆణువణువూ మురిసేలా చిగురాశలు మెరిసేలా
తోలి శకునం ఎప్పుడు ఎదురైందో

______________________

పాట పేరు : ఎవరైన ఎపుడైనా (Evaraina Epudaina) (Male)(female)
సినిమా పేరు: ఆనందం Anandam (2001)
నటీనటులు : ఆకాష్ (Akash), రేఖ (Rekha), థాను రాయ్ (Thanu Rai), వెంకట్ (Venkat)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
గాయని(లు) Male and female : ప్రతాప్ విధు (Pratap Vidhu), చిత్ర (Chitra)
గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Sitarama Sastry)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.