yellipoke yellipoke nannila vadili Part 2 song lyrics
ఓ గడిచిపోయినా నా గతమే నన్ను వెంటాడుతుంది
మోయలేని బాధనే చూపి ఎందుకు ఎదురయింది
నే చేసిన తప్పేది ప్రేమ
నిన్ను నేను నమ్మడమా
నా సావు చివరి చూపుకేనా చూసిపొగ వచ్చినావా
ఎల్లిపోకే ఎల్లిపోకే నన్నిలా వదిలి
చెప్పుకోలేని బాధ ఉన్నదే మర్చిపోని మజిలీ
ఉండలేను నిలువలేను నువ్వు లేకుండా
జ్ఞాపకాలతోనే బ్రతికి ఉన్న నిన్ను తలుచుకుంటా
మాయమైన చందమామవు నువ్వే
ఒంటరైన చుక్కనైతిని నేనే
గాయమే చేసి నువ్వేళ్ళిపోతే
నీ బాధలో నేను యుద్ధం చేసే
ఎల్లిపోకే ఎల్లిపోకే నన్నిలా వదిలి
చెప్పుకోలేని బాధ ఉన్నదే మర్చిపోని మజిలీ
ఉండలేను నిలువలేను నువ్వు లేకుండా
జ్ఞాపకాలతోనే బ్రతికి ఉన్న నిన్ను తలుచుకుంటా
ఈ కడలి అలలకే తెలుసు తల్లడిల్లి నా మనసు
కంటనీరు ఆగదు నాబాధే తీరదు
నీ జ్ఞాపకాలు బతికి ఉన్నన్నాళ్ళు
నా గుండెల్లోనే నిప్పైమండి కాల్చేస్తుందే
అయ్యో చంపేస్తుందే..
నువ్వు దూరమయ్యాకనే ప్రాణమైతె పోయిందిలే
సచ్చిపోయినా నిప్పు వెట్టని వట్టి దేహమే
ఎల్లిపోకే ఎల్లిపోకే నన్నిలా వదిలి
చెప్పుకోలేని బాధ ఉన్నదే మర్చిపోని మజిలీ
ఉండలేను నిలువలేను నువ్వు లేకుండా
జ్ఞాపకాలతోనే బ్రతికి ఉన్న నిన్ను తలుచుకుంటా
ఇది విధి ఆడిన వింత ఆట ఎటు సాగని బతుకుబాట
ఎంత బాధ మోయనే ప్రాణమాగమాయెనే
నీ మనసు నాకు తెలుసు ఎందుకమ్మ అలుసు
ఎంత దాసినా కళ్ళల్లోని బాధ కనిపిస్తుందే
కన్నీళ్ళే చుపిస్తుందే..
అడగవమ్మ నీగుండెనే సెప్పుతుంది నీబాధనే
సావులేని ప్రేమ గదనే ఒప్పుకోలేవే
ఎల్లిపోవే ఎల్లిపోవే నన్నిలా వదిలి
మల్లిరాకే వెల్లిపోవే నన్నిలా వదిలి
మరిచిపోవే తలుచుకోకే మన తొలి పరిచయాన్ని
నా బ్రతుకంతా బాధమోస్తూ బంధీనై ఉంటనే
_______________________
సాంగ్ : ఎల్లిపోకే ఎల్లిపోకే నన్నిలా వదిలి పార్ట్ 2 (yellipoke yellipoke nannila vadili Part 2)
సంగీతం – ఇంద్రజిత్ (Indrajitt)
గాయకుడు, లిరిక్స్ – కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం – దిలీప్ దేవగన్ (Dilip Devgan)
నటీనటులు – దిలీప్ దేవగన్ (Dilip Devgan), అను (Anu), మోహన్ మర్రిపెల్లి (Mohan Marripelli)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.