సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల
ఎదగు ఉగుతుండే లోలోన
నదులన్నీ కలిసినట్టు ఓ బావ
నవ్వెంత బాగున్నది నీలోన
తొలిపొద్దు వెలుగుల్ల మెరిసేటి ఓ పిల్ల
తెలుగంటి అందాలు చిగురించే నీలోన
నవరత్న వెలుగులల్లా ఓ పిల్ల
నవ్వుల హరివిల్లువే ఈ వేళ
సింధూర గంధాల సంపంగ తోటల్లో
సందే పొద్దుల వేళ చాటుంగా పిలిచేటి
మంచు పువ్వుల వాడివే ఓ బావ
మనసంతా నీవున్నావో ఈ వేళ
సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల
ఎదగు ఉగుతుండే లోలోన
ఏడు రంగుల కొంగుల ఓ పిల్ల
ఎద మీద పరిచనవే నిండుగా
పాల వెన్నెల చూపులు ఓ బావ
పైట కొంగులో దాగెను చాటుంగా
ఏడు రంగుల కొంగుల ఓ పిల్ల
ఎద మీద పరిచనవే నిండుగా
పాల వెన్నెల చూపులు ఓ బావ
పైట కొంగులో దాగెను చాటుంగా
బంగారు కలవన్నె భామ నీ నవ్వుల్లా
బృందావనాలన్నీ విరబూసే నిండుగా
అమృత ఘడియాలల్ల ఓ పిల్ల
అల్లిన పొదరిల్లువే ఈ వేళ
ఎదురు చూపులు చూసే ఎన్నెల వెలుగుల్లో
ఎండమావుల తోనే నిండిన కన్నులో
కాలువ పువ్వుల వాడివే ఓ బావ
కలిసేట్ల మనముందుము ఈ వేళ
నల్ల రేగడి తోవల ఓ పిల్ల
నడువంగా ముద్దాయనే నీ అడుగుల్లా
తొలకరి చినుకులల్లా ఓ బావ
తడిసిన మనవలేవో ఈ అడవుల్లా
నల్ల రేగడి తోవల ఓ పిల్ల
నడువంగా ముద్దాయనే నీ అడుగుల్లా
తొలకరి చినుకులల్లా ఓ బావ
తడిసిన మనవలేవో ఈ అడవుల్లా
నీ రాకతో నింగి నేలంతా మురిసింది
నీలి సంద్రం మీద చిరునవ్వు విరిసింది
పున్నమి రంగులల్లా ఓ పిల్ల
పూసిన సిరిమల్లేవే ఈ వేళ
పేగు బంధం తోని పెరిగిన ప్రేమల్ల
రక్త సంబంధాలు రాలేని దారుల్లా
బంతి పువ్వుల వాడివే ఓ బావ
బాసింగ బలమేలనో ఈ వేళ
తొలిసూరు జాబిల్లివే ఓ పిల్ల
తేనే మబ్బులు కురిసెనే నీ వెలుగుల్లా
రంగు రంగు తారలు ఓ బావ
రథమల్లె వస్తున్నాయ్యో ఈ దారుల్లా
తొలిసూరు జాబిల్లివే ఓ పిల్ల
తేనే మబ్బులు కురిసెనే నీ వెలుగుల్లా
రంగు రంగు తారలు ఓ బావ
రథమల్లె వస్తున్నాయ్యో ఈ దారుల్లా
కలలూరే అందాలు కనకాంబరాలల్లా
పొలమారే బందాలు పొగమంచు తెరలల్లా
వసంత ఋతువులల్లా విరిసిన పూలన్నీ కురిసినయ్యో ఈ వేళ
మధుమాసం వచ్చింది మన ఇంటి గడపల్ల
మనసంతా నిండింది ఈ పెళ్లి పందిళ్ల
ఆ నింగి తరలన్నీ దివి నుండి అక్షింతలయ్ రాలెనో ఈ వేళ
ఆ ఇంద్ర లోకాలన్నీ ఉరవంగా ఆశీసులనందించెను ఈ వేళా
సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల
ఎదగు ఉగుతుండే లోలోన
______________________
సాంగ్ : సెలయేళ్ళు (Selayellu) part 2
లిరిక్స్: మహేందర్ ముల్కల (Mahender Mulkala)
సంగీత దర్శకుడు: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
గాయకులు : Dj శివ వంగూర్ (Djshiva Vangoor), శ్రీనిధి (Srinidhi)
నటీనటులు : Dj శివ వంగూర్ (Djshiva Vangoor) & నివేద్య ఆర్ శంకర్ (Nivedya R Sankar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.