నా ముద్దులయ్యా నా ముద్దులయ్యా
గుట్ట కింద గుంపు చెట్ల నిండ
గుట్ట కింద గుంపు చెట్ల నిండ
సెయ్యి పట్టిన సెయ్యి పట్టిన
సెయ్యి పట్టి గుంజకయ్యో ముద్దులయ్యా
మందితోని నాకు రందయ్యో నా ముద్దులయ్యా
అయ్యో సెయ్యి పట్టి గుంజకయ్యో నా ముద్దులయ్యా
మందితోని నాకు రందయ్యో ముద్దులయ్యా
అరెరే
గుట్ట కింద గుంపు చెట్ల నిండ
గుట్ట కింద గుంపు చెట్ల నిండ
వరసకు నాకు వరసకు నాకు
వరసకు మరదాలివే నా ముద్దు గుమ్మ
మందితోని మనకెందుకే నా ముద్దు గుమ్మ
వరసకు మరదాలివే నా ముద్దు గుమ్మ
మందితోని మనకెందుకే నా ముద్దు గుమ్మ
ఆహా బండ కింద నిండబంతి తోట
బండ కింద నిండబంతి తోట
బతలాడ నన్ను బతలాడ నన్ను
బతలాడ పిలవకయ్యో నా ముద్దులయ్యా
వరసయ్యే బావులున్నారో జర జరుగయ్యా
నా బతలాడ పిలవకయ్యో నా ముద్దులయ్యా
వరసయ్యే బావులున్నారో జర జరుగయ్యా
అరె బండ కింద నిండబంతి తోట
మనసంతా నువ్వేనంట
బావలుంటే మీ బావలుంటే
మీ బావలుంటే భయమేమిలే ఓ ముద్దు గుమ్మ
మనసంతా నిండినావమ్మో నా ముద్దు గుమ్మ
బావలుంటే భయమేమిలే ఓ ముద్దు గుమ్మ
మనసంతా నిండినావమ్మో నా ముద్దు గుమ్మ
ఎహే చెప్పితిన నీ మంకు ఏందో చెవిన పడుతలేదా నీకు
ఎంటబడిన ఎంటబడిన
ఏంటబడి నన్ను చెంపకు నా ముద్దులయ్యా
సందులల్ల కండ్లు గణము ఓ నా ముద్దులయ్యా
నా ఏంటబడి నన్ను చెంపకు నా ముద్దులయ్యా
సందులల్ల కండ్లు గణము ఓ నా ముద్దులయ్యా
నా ప్రాణమంతా నీ మీదే పరిషానే చేస్తున్నది
నువ్వు లేక పిల్ల నువ్వు లేక పిల్ల
నువ్వు లేకుండలేనమ్మో నా ముద్దు గుమ్మ
నువ్వు దక్కకుంటే నే చస్తానే ఏదేమైనా
పిల్ల నువ్వు లేక ఉండలేనమ్మో నా ముద్దు గుమ్మ
నువ్వు దక్కకుంటే నే చస్తానే ఏదేమైనా
అయ్యో అంత మాటలెందుకయ్యా నువ్వంటే ఇష్టమయ్యా
మందితోని అయ్యా మందితోని
ఆ మందితోని మాటొద్దని ఓ ముద్దులయ్యా
జర్ర మంచి మాట నే చెప్పిన నా ముద్దులయ్యా
లగ్గమైతే చేసుకుందామే నా ముద్దులయ్యా
జన్మంతా జంటగుందమే ముద్దులయ్యా
పిల్ల వనమొచ్చే మాటన్ను
పదిలంగా చూసుకుంటా జనుమంత జనుమంతా
జనుమంతా చూసుకుంటా నా ముద్దు గుమ్మ
సచ్చేదాకా నీకు తొడుగుంట నా ముద్దు గుమ్మ
జనుమంతా చూసుకుంటా నా ముద్దు గుమ్మ
సచ్చేదాకా నీకు తొడుగుంట నా ముద్దు గుమ్మ
___________________
లిరిక్స్: ప్రభ (Prabha)
గాయకులు: జబర్దస్త్ నూకరాజు (Jabardasth Nukaraju) & ప్రభ (prabha)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat ajmeera)
తారాగణం : జబర్దస్త్ నూకరాజు (Jabardasth Nukaraju) & ఆసియా (asiya)
దర్శకుడు: జబర్దస్త్ నూకరాజు (Jabardasth Nukaraju)
నిర్మాతలు : జబర్దస్త్ నూకరాజు (Jabardasth Nukaraju) & రాము (Ramu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.