జీవితం నా జతై తోడు లేదు ఏ క్షణం
తీరమే తెలియదే ఎటువైపో ఈ పయణం
విధిరాతకు ఎదురే తిరిగి ఎంతో గెలిచాను
వెంట నిలిచే వారే లేక ఒంటరినయ్యాను
మరువలేని జ్ఞాపకాలతో వెళ్ళిపోతున్నాను
నాతో నేను నాతో నేను
నాతో నేను నాతో నేను
జాలి లేని లోకం లో ఆపలేని శోకం లో
మనసు తోటే ఊసులు చెబుతూ కాలం గడిపానే
పసి వయసే పాశంలా ప్రేమే ఒక మోసంలా
గాయపడిన గుండెకు మళ్ళీ గాయం చేసాయే
అసలెండిపోయిన తిండి లేకపోయినా
ఎదురు దెబ్బలెన్నో తింటూ బ్రతుకుకెదురు నడిచానే
తిరిగి చూస్తే ఎవరు లేక ఒకడై మిగిలానే
నాతో నేను నాతో నేను
నాతో నేను నాతో నేను
______________________
సాంగ్ : నాతో నేను (టైటిల్ ట్రాక్) (Natho Nenu (Title Track))
సినిమా పేరు: నాతో నేను (Natho Nenu)
గాయకుడు: శ్రీ కృష్ణ (Sri Krishna)
సంగీతం: సత్య కశ్యప్ (Satya Kashyap)
లిరిక్స్ : శాంతికుమార్ తుర్లపాటి (Santhikumar Turlapati)
నిర్మాత: ప్రశాంత్ టంగుటూరి (Prashanth Tanguturi)
దర్శకుడు: శాంతి కుమార్ తుర్లపాటి (Santhi Kumar Turlapati)
తారాగణం: సాయి కుమార్ (Sai Kumar),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.