ఏమయ్యిందే గుండెకు
ఏనాడూ లేదే ఇంత ఉలుకు
నీ వల్లే కాదని అనకు
ఏమయ్యిందో తెలిసే వరకు
ఆగదు నా అడుగు
ఏం చేసావే నన్ను
చూస్తూనే ఉన్నాలే నిన్ను
చూపైనా తిప్పుకోలేను
ఏం చేసావో తెలిపే వరకు
నీ వెనకే పరుగు నువ్వెల్లే దారుల్లో
వేచి చేస్తాలే రోజంతా నేనిలా…
ఓసారి చూసి పోవే ఊపిరితోనే ఉంటలే…
ఎయి ఎయి ఎలేలే ఎలేలే ఏలే బంగారి పిల్ల
ఎలేలే ఎలేలే ఏలే నా బుజ్జి పిల్ల
ఎలేలే ఎలేలే బాగున్నావే చాల
గుండె గళ్ళ పట్టి ఇలా గుంజేసి పోకే ఎలా
నీ లాల కన్నులల్లా పడ్డలే నిలువెల్ల
ముందే రాసుండే ఈ బంధం
ముందుకు తోసిందే ఈ కాలం
ముంగిట నిలిపిందే నీ రూపం
నువ్వే నాకు దారి చూపే దీపం
ఇంకా ఎందుకులే సందేహం
ఇద్దరిది ఒక్కటేలే సంతోషం
ఏనాడో మొదలాయె ప్రయాణం
నానుండి పొలేవంటా నువ్వే దూరం
పడిపోయ పడిపోయానే నీ ప్రేమల్లో నేనే
నువ్ కూడా పడ్డావేమో అనిపిస్తుందే
విడిపోయ విడిపోయానే నిమిషాల్లో నన్ను నేనే
నీవల్లే నీవల్లేనే ఓ మాటే విప్పి చెప్పరాదే….
ఎయి ఎయి ఎలేలే ఎలేలే ఏలే బంగారి పిల్ల
ఎలేలే ఎలేలే ఏలే నా బుజ్జి పిల్ల
ఎలేలే ఎలేలే బాగున్నావే చాల
గుండె గళ్ళ పట్టి ఇలా గుంజేసి పోకే ఎలా
నీ లాల కన్నులల్లా పడ్డలే నిలువెల్ల
ఆకాశ దేవతల వచ్చావే
అదృష్ట జాతకంలా పట్టావే
నా ద్రుష్టి దోషమంతా మార్చవే
చేతులోన గీతల్లా చేరావే
అమృత కలసంలా అందావే
అద్భుత గడియల్లా చేరేవే
నా రాశి ఫలితాలే నువ్వేలే
నీ రాకే నాకు మంచి ముహుర్తలే
నువ్వు చూస్తే అంతే చాలు
ఆ తిథితో నక్షత్రాలు అతిధుల్లా వచేస్తాయే ఈ నెలకే
కలిసాకే నిన్ను నేను
కలిసొచ్చేకాలంలాగా నడిసొచ్చావంటూ నువ్వే
ఇవాళే నాకు తెలిసొచ్చిందే….
ఎయి ఎయి ఎలేలే ఎలేలే ఏలే బంగారి పిల్ల
ఎలేలే ఎలేలే ఏలే నా బుజ్జి పిల్ల
ఎలేలే ఎలేలే బాగున్నావే చాల
గుండె గళ్ళ పట్టి ఇలా గుంజేసి పోకే ఎలా
నీ లాల కన్నులల్లా పడ్డలే నిలువెల్ల
_________________________
పాట పేరు: ఏమయ్యిందే (Yemayyinde)
సాహిత్యం: సురేష్ గంగుల (Suresh Gangula)
గాయకుడు: ఈశ్వర్ దాతు (Eswar Dathu)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
దర్శకుడు: అర్జున్ జంధ్యాల (Arjun Jandyala)
కథ: ప్రశాంత్ వర్మ (Prasanth Varma)
నిర్మాత: సోమినేని బాలకృష్ణ (Somineni Balakrishna)
తారాగణం: అశోక్ గల్లా (Ashok Galla), మానస వారణాసి (Manasa Varanasi), దేవదత్త గజానన్ నాగే (Devdatta Gajanan Nage)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.