ఏడేడు లోకాలే ఏలేటి రాముడే
అడవుల్లో సీతమ్మను వదిలేసినాడే
పతి అంటూ సతి అంటూ మురిసిన రాధని
రాతల్లో లేనన్నీ కుమిలిపోయానే
కాలమే రాసే ఈ తీరుగా
బతుకుతున్నరా నిన్నే చేరగా
ప్రేమనే మాటనే నమ్మిన
కనుకే తెంచుకోలే నిన్ను వేరుగా
నా గుండెలోన నే నిన్నే మోసి
నీకై గురుతులెన్నో మొస్తిరో
గురుతున్నదయ్యా నీ సెయ్యి పట్టి
ఇడిసి పోనని ఒట్టును
ఏడు కన్నుల ఏడు కొండల సామి
తప్పే నే చేస్తినో
ఎట్లా సెప్పురా ఓదవా నా ప్రేమ
దిక్కులేని యాతనో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
తప్పే నే చేస్తినో
ఎట్లా సెప్పురా ఓదవా నా ప్రేమ
దిక్కులేని యాతనో
ఓ మనసంతా నిన్నే మోసుకున్నగాని
మెరిసి నేనే ఉంటినే
(మెరిసి నేనే ఉంటినే)
నా తనువంతా నిన్నే దాచుకున్నగాని
తలరాతే రాయపాయే
(తలరాతే రాయపాయే)
నీ పట్టీల సప్పుడే నా సవ్వడనుకుంటూ
మురిసిననే నిన్ను బంగారమంటూ
ముంచెత్తు కొచ్చెను ఉరితీసిపోయెను
మరిచిననే నిన్ను గురుతులేనట్టు
ఓ గాయలు చేసింది నేనైనా
గడియ నిన్ను చూడకుండా ఉంటనా
నా కోసమే బంధాలన్నీ ఇడిసివా
బాధలెన్నో నీకె బహుమతిచ్చినా
ఏడు కన్నుల ఏడు కొండల సామి
గతమంతా గాయలేరో
ఎట్లా సెప్పురా ఓదవా నా బతుకు
సీత లేని రాతరో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
గతమంతా గాయలేరో
ఎట్లా సెప్పురా ఓదవా నా బతుకు
సీత లేని రాతరో
(సీత లేని రాతరో)
ఓ అనుకుంటినమ్మో నీ ఏలు పట్టి
ఏడు అడుగులేసి బతుకుతనాన్ని
కలగంటినమ్మో నా ఒళ్ళో నిన్నే
సంటి పిల్ల లెక్క సాగుకుంటన్ని
ఆ దేవుడే మనలను ఓర్వక
దారులే మార్చినాడేమో వేరుగా
నా కన్నీళ్లే తుడిచేటి చేయిగా
నువ్వే కావాలమ్మో ప్రతి జన్మల
మోసమే కాదమ్మో నీ మీద ప్రేమే
చూసుకుంటా ఎన్ని కష్టాలే రాని
కాటివరకైనా కలిసొస్తానమ్మో
దేవుడే మనలను ఎడబాపే గాని
ఏడు కన్నుల ఏడు కొండల సామి
ఎదురు సూపే మిగిలేరో
ఎట్లా సెప్పురా ఓదవా నా బాధ
ముళ్ల బాటలేస్తివో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
ఎదురు సూపే మిగిలేరో
ఎట్లా సెప్పురా ఓదవా నా బాధ
ముళ్ల బాటలేస్తివో
(ముళ్ల బాటలేస్తివో)
_____________________________
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
సాహిత్యం: దివ్య బోనగిరి (Divya Bonagiri)
గానం: దివ్య మాలిక (Divya Maalika )& హనుమంత్ యాదవ్ (Hanumanth Yadav)
తారాగణం: అక్షిత్ మార్వెల్ (Akshith Marvel), రీను స్క్ (Reenu sk ) & వణ్య అగర్వాల్ ( Vaanya Agarwal)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.