Home » చూసి చూడంగానే – ఛలో

చూసి చూడంగానే – ఛలో

by Hari Priya Alluru
0 comment

చూసి చూడంగానె నచ్చేశావే
అడిగి అడగకుండ వచ్చేశావే
నా మనసులోకి…హో అందంగా దూకి.

దూరం దూరంగుంటు ఏం చేశావే
దారం కట్టి గుండె యెగరేశావే.

ఓ చూపు తోటీ.. హో ఓ నవ్వు తోటీ…

తొలిసారిగా.. తొలిసారిగా..
నా లోపలా.. నా లోపలా..

ఏమయిందో..ఏమయిందో.. తెలిసేదెలా…తెలిసేదెలా…

నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు నీలోను చూసానులే

నీ వంకే చూస్తుంటె అద్దంలో నన్నెను చూస్తున్నట్టె ఉందిలే హో.

నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటె
అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే.

నువ్ నా కంట పడకుండా నా వెంట పడకుండ ఇన్నాలెక్కడ ఉన్నావే.

నీ కన్నుల్లో ఆనదం వస్తుందంటె
నేనెన్నో యుద్దాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామి ఇస్తున్ననులే.

ఒకటొ యెక్కం కుడా మరిచిపొయెలాగా
ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలన.

నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు
నీలోను చూసానులే.

నీ వంకే చూస్తుంటె అద్దంలో నను నేనె చూస్తున్నట్టె ఉందిలే హో.

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment