(హరి హర…ఆ ఆ)
నువ్వో రాయి నేనో శిల్పీ
చెక్కుతున్నంత సేపూ
నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ
ఆ తరువాత అంటారంతా
నిన్ను దేవుడనీ
నేనో అంటరానివాడిని
నువ్వో రాయి… నేనో శిల్పీ
చెక్కుతున్నంత సేపూ
నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ
ఆ తరువాతా అంటారంతా
నిన్ను దేవుడనీ
నేనో అంటరానివాడిని
నీ గర్భగుడినే కట్టేటపుడు
నేను పెద్ద మేస్త్రి
అది పూర్తయ్యాక లోనకొస్తావుంటే
నన్ను బయటికి తోస్తివి
నిన్ను మేలు కొలుపగ
డోలు సన్నాయి… నేనే వాయిస్తిని
కాని నిన్ను తాకే భాగ్యం లేదా
నేనేం పాపం చేస్తినీ
(అయ్యో…. దేవా)
నువ్వు నడిచేప్పుడు
నీ పాదాలు కందకుండా
చేసాను నీకు చెప్పులు
నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు
ఏంటయ్యా నా తప్పులు
సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో
నేసాయి నా చేతులు
కానీ నిను చూడ రావాలంటే
నాకో జత బట్టల్లేవు
ఏంటయ్యా మా రాతలు
నీ మాసిన బట్టలే
మా ప్రసాదామని
నేను శుభ్రం చేస్తిని
కానీ మలిన పడిన వాడివంటూ
దూరంగా ఉండాలంటివి
నీ ముందు వెలిగే దీపంటలు
నా చెమటతో చేస్తినీ
కానీ ఎందుకో మా మట్టి బ్రతుకున
ఏ దీపం పెట్టవైతివి
(ఏ…. ఏ ఏ ఏ)
నోరే లేని మూగజీవాలను గాయమని
గోసీ ఓ గొంగడి ఇస్తివి
ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే
లేవన్నట్లు సులకనగా వెనకబడేస్తివి
తల్లీ పాల వంటి… తాటి కల్లు గీసే
నా గోసలు చూడవైతివి
వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్ళకు
నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి
నీ పల్లకీ చేసిన చేతులకు
పాచిక పుల్లయిన ఇవ్వకపోతివి
ఊళ్ళో అందరికీ నేనే క్షవరాలు చేస్తే
నా బ్రతుకే క్షవరం చేస్తివి
మా పుట్టుక బట్టీ… చేసే పని బట్టీ
ఏవేవో పేర్లు పెడితివి
కానీ ఉన్నోడు లేనోడంటూ
తేడాలు చూపి నువ్ కూడా
మనిషై పోతివి
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.