తెలుసే తెలుసే నువు నా ఎదురుగా లేవు
తెలుసే తెలుసే ఇక నా వైపుకే రావు
తెలుసే తెలిసే మళ్ళి నిన్ను కోరాను
తెలిసే తెలిసే నీకై వెతుకుతున్నాను
ప్రియురాలా అర్ధం కాలేదా
దయ లేదా కొంచెం నా మీద
లోకంలో నా కన్నా నిన్ను
ప్రేమించే వాణ్ణి చూపిస్తే చాలు
ఆరోజే నీనుండి నేను
దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు
నీతో నేను వేరయ్యానంటూ కోపంగా
నీలాకాశం నల్లంగా మారిందే
నువ్వే నన్ను వదిలేవంటు ఆవేశంగా
మేఘం కూడా నిప్పుల్నే చల్లిందే
నువ్వు నేను సరదాగా తిరిగిన ప్రతి చోటు
నన్నే చూసి మొహమే చాటేస్తుందే
నువ్వీ చోట నాకై మిగిలుంచిన ప్రతి గురుతు
నాలో వుంటూ నన్నే తొలిచేస్తుందే
లోకంలో నా కన్నా నిన్ను
ప్రేమించే వాణ్ణి చూపిస్తే చాలు
ఆరోజే నీనుండి నేను
దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు
ఒకటయ్యాక ఒంటరిగా ఉంటె ఆ ప్రాణం
సూన్యం తోనే సావాసం చేస్తుందే
ప్రేమించాక నీ ప్రేమని పొందని ఆ హృదయం
ఉన్నటుంది తన సవ్వడి ఆపిందె
ఏదో రోజు నువ్వు వస్తావన్న ఈ ఆశే
శ్వాసై నన్ను బ్రతికిస్తూనే ఉందే
మళ్ళి జన్మ అసలుందో ఏమో ఏమోలే
ఇపుడీ జన్మ నువ్వు కావాలంటుందే
లోకంలో నా కన్నా నిన్ను
ప్రేమించే వాణ్ణి చూపిస్తే చాలు
ఆరోజే నీనుండి నేను
దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు
_______________________
సాంగ్: తెలుసే తెలుసే (Teluse Teluse)
హీరో: ఆది పినిశెట్టి (Aadi Pinisetty)
హీరోయిన్: నిక్కీ గల్రానీ (Nikki Galrani)
దర్శకుడు: ARK శర్వణన్ (ARK sarvanan)
సంగీతం: ధిబు నినన్ థామస్ (Dhibu ninan thomas)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.