Home » మేఘల పల్లకిలోన (Meghala Pallakilona) సాంగ్ లిరిక్స్ – Folk

మేఘల పల్లకిలోన (Meghala Pallakilona) సాంగ్ లిరిక్స్ – Folk

by Lakshmi Guradasi
0 comment

మేఘాల పల్లకిలోన ఊరేగుతున్న మేఘమాల
సాయంకాలం సంధ్యవేళ సరసమాడ రావే సందమామ

బంతి చామంతి పూతోట
పాడుకుందామ కమ్మని పాట
చిన్ని చిన్ని గుండెల్లోన
నాపై కురిసేనమ్మ జోరు వాన

నెమలమ్మ నాట్యం సెలయేరు పరవళ్లు
నీలోనే చూసాను ఎంత అందమే
చలి గాలి స్నానాలు తొలి మంచు స్వప్నలు
ముస్తాబు అయ్యాను నీకోసమే

మేఘాల పల్లకిలోన ఊరేగుతున్న మేఘమాల
సాయంకాలం సంధ్యవేళ సరసమాడ రావే సందమామ

బంతి చామంతి పూతోట
పాడుకుందామ కమ్మని పాట
చిన్ని చిన్ని గుండెల్లోన
నాపై కురిసేనమ్మ జోరు వాన

(హొయ్లేసా హొయ్ హొయ్లేసా
హొయ్లేసా హొయ్ హొయ్లేసా)
(హొయ్లేసా హొయ్ హొయ్లేసా
హొయ్లేసా హొయ్ హొయ్లేసా)

పొద్దునే లేచి కల్లాపు జల్లి
ముత్యాల ముగ్గునే నీకోసం ఏసా
ఆ సుక్కలన్ని నీ సిగ్గులయ్యి
మెరిసెనే అందాల ముద్దుగుమ్మా

సెప్పకుండా చేరినావుగా సుట్టమల్లే నా గుండెల
ఒక్క పూట నిన్ను చూడక ఉండలేనే ఓ వెన్నెల

పచ్చడి మెతుకులు పంచుకుని
తిన్న పాత జ్ఞాపకాలు గురుతుకొచ్చే
జామతోటలోన దాగుడు మూతలు
ఆడిన బాల్యం నిన్ను నన్ను పిలిచే

మేఘాల పల్లకిలోన ఊరేగుతున్న మేఘమాల
సాయంకాలం సంధ్యవేళ సరసమాడ రావే సందమామ

బంతి చామంతి పూతోట
పాడుకుందామ కమ్మని పాట
చిన్ని చిన్ని గుండెల్లోన
నాపై కురిసేనమ్మ జోరు వాన

అరె నీ కళ్ళలోన మెరుపు మెరిసింది
నా గుండెలోకి దూసుకొచ్చింది
ఆకాశంలో హరివిల్లు విరిసింది
మన ప్రేమకే కానుకే పంపింది

ఎహే చుట్టుకుంది మల్లెతీగల
నడుము వుంది నాగు పాముల
నీ అల్లరి ఏంది కొంటె పిల్లోడా
మా వొల్లతోటి మాట్లాడారా

హొయ్ పంచధార రామచిలక
నా పంచప్రాణాలు తోడేయ్యకే
పసిడి వన్నెలున్న పిల్లగాడా
నేను పుట్టింది నికోసమేరా

మేఘాల పల్లకిలోన ఊరేగుతున్న మేఘమాల
సాయంకాలం సంధ్యవేళ సరసమాడ రావే సందమామ

బంతి చామంతి పూతోట
పాడుకుందామ కమ్మని పాట
చిన్ని చిన్ని గుండెల్లోన
నాపై కురిసేనమ్మ జోరు వాన

నెమలమ్మ నాట్యం సెలయేరు పరవళ్లు
నీలోనే చూసాను ఎంత అందమే
చలి గాలి స్నానాలు తొలి మంచు స్వప్నలు
ముస్తాబు అయ్యాను నీకోసమే

మేఘాల పల్లకిలోన ఊరేగుతున్న మేఘమాల
సాయంకాలం సంధ్యవేళ సరసమాడ రావే సందమామ

బంతి చామంతి పూతోట
పాడుకుందామ కమ్మని పాట
చిన్ని చిన్ని గుండెల్లోన
నాపై కురిసేనమ్మ జోరు వాన

(హొయ్లేసా హొయ్ హొయ్లేసా
హొయ్లేసా హొయ్ హొయ్లేసా)
(హొయ్లేసా హొయ్ హొయ్లేసా
హొయ్లేసా హొయ్ హొయ్లేసా)

______________________

పాట: మేఘల పల్లకిలోన (Meghala Pallakilona)
నటులు: కార్తీక్ రెడ్డి (Karthik Reddy), మీనాక్షి (Meenakshi)
లిరిక్స్ & సింగర్: అనిత నాగరాజు (Anitha Nagaraju)
స్త్రీ గాయని: శ్రీనిధి నరేళ్ల (Srinidhi Narella)
సంగీతం: వివి వినాయక్ (VV Vinayak)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment