పట్టు బంగారు పంచే కట్టిండే
భారీ బుల్లెట్టు బండి ఎక్కిండే
జోడు జోడు ఉంగరాలు పెట్టిండే
కోడె నాగు తీరు సూడబట్టిండే
నీలి నీలి కన్నులున్నవాడు
నన్ను చూసి మురిసి పాతడే
సెంటుమెల్లె పువ్వులల్లె పిల్ల
చందమామ నువ్వని అంటాడే
రంగుల రబ్బరు గాజులు తెచ్చి
రాజుగా చేతికి పెడతాడే
రాణిలాగా చూసుకుంటాడే
పౌరుషాల పిల్లగాడు వాడు
పందెం లో కోడి పుంజోలె
నన్ను గెలిచినాడు పొల్లగాడు
ఈడు జోడు కలిసినోడు
వాడు విడువడమ్మ మేన పిల్లగాడు
ప్రేమగళ్ళ బావగాడు
పౌరుషాల పిల్లగాడు వాడు
పందెం లో కోడి పుంజోలె
నన్ను గెలిచినాడు పొల్లగాడు
ఈడు జోడు కలిసినోడు
వాడు విడువడమ్మ మేన పిల్లగాడు
ప్రేమగళ్ళ బావగాడు
నల్లరేణి కళ్ళజోడు పెట్టిండే
నాటు నవ్వుతోనే సిటీ కొట్టిండే
జోరు జారుగున్న ఊరి పిల్లోడే
జంట కోరి వెంట తిరుగుతున్నడే
దొంగ రామ చిలుక అంటూ వాడు
గాబురంగా పిలుచుకుంటాడే
గడియ నిన్ను చూడకుంటే పిల్ల
గుండె గాబరైతదంటాడే
ఎర్ర చందనాలు బుగ్గల మీద
సిగ్గులన్ని దాయమంటాడే
సంబరాలు చేసుకుంటాడే
పౌరుషాల పిల్లగాడు వాడు
పందెం లో కోడి పుంజోలె
నన్ను గెలిచినాడు పొల్లగాడు
ఈడు జోడు కలిసినోడు
వాడు విడువడమ్మ మేన పిల్లగాడు
ప్రేమగళ్ళ బావగాడు
పౌరుషాల పిల్లగాడు వాడు
పందెం లో కోడి పుంజోలె
నన్ను గెలిచినాడు పొల్లగాడు
ఈడు జోడు కలిసినోడు
వాడు విడువడమ్మ మేన పిల్లగాడు
ప్రేమగళ్ళ బావగాడు
కోరమీసాల కొంటె పిల్లోడే
కాలు దువ్వి కయ్యం ఆడుతూంటాడే
మరదలంటూ మందలించి బుల్లోడే
మబ్బులల్ల తేలిపోతావుంటాడే
సింగరేణి దారులల్ల
వాడు సింగిడోలే ముద్దుగుంటాడే
పంచధార నవ్వులొల్ల
పిల్ల పైరా జొన్న సెను అంటాడే
కోరిన అందాల దేవత నువ్వని
గుండెలోన దాచుకుంటాడే
పండుగేదో చేసుకుంటాడే
పౌరుషాల పిల్లగాడు వాడు
పందెం లో కోడి పుంజోలె
నన్ను గెలిచినాడు పొల్లగాడు
ఈడు జోడు కలిసినోడు
వాడు విడువడమ్మ మేన పిల్లగాడు
ప్రేమగళ్ళ బావగాడు
పౌరుషాల పిల్లగాడు వాడు
పందెం లో కోడి పుంజోలె
నన్ను గెలిచినాడు పొల్లగాడు
ఈడు జోడు కలిసినోడు
వాడు విడువడమ్మ మేన పిల్లగాడు
ప్రేమగళ్ళ బావగాడు
సుక్కలోలె సూపులున్న సిన్నోడే
సక్కనైన ప్రేమగళ్ళ మెనోడే
ముద్దు మాపు హద్దు లేని పిల్లోడే
ముద్దు తీరా ముద్దులియమంటాడే
నల్లమందు చల్లినట్టు
వాడు నిదురలోన నిండుకుంటాడే
ఊపిరాడకుండా చేసి
నన్ను ఉప్పినోలె దువ్వుకుంటాడే
ఎండి బంగారాల బంగుల మీద
ఏలుకుంటా పిల్ల అంటాడే
తాళికట్టి తోడుగుంటాడే
పౌరుషాల పిల్లగాడు వాడు
పందెం లో కోడి పుంజోలె
నన్ను గెలిచినాడు పొల్లగాడు
ఈడు జోడు కలిసినోడు
వాడు విడువడమ్మ మేన పిల్లగాడు
ప్రేమగళ్ళ బావగాడు
_____________________
పాట: పౌరుషాల పిల్లగాడు (Pourushala Pillagadu)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan Keys)
సాహిత్యం: మహేందర్ ముల్కల (Mahendar Mulkala)
గాయని: వాగ్దేవి (Vagdevi)
తారాగణం : జానులిరి (janulyri), అనీల్ మొగిలి (Aneel mogili)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.